Begin typing your search above and press return to search.

మినీ రివ్యూ: 'బెల్ బాటమ్' ఎలా ఉందంటే..

By:  Tupaki Desk   |   19 Aug 2021 9:30 AM GMT
మినీ రివ్యూ: బెల్ బాటమ్ ఎలా ఉందంటే..
X
కరోనా నేపథ్యంలో గత రెండేళ్లుగా బాలీవుడ్ మార్కెట్ పరిస్థితి దారుణంగా ఉంది. థియేటర్లు మూతబడి ఉండటంతో సినిమాలన్నీ ఓటీటీలోనే విడుదల చేసుకోవాల్సి వచ్చింది. ఇలాంటి పరిస్థితుల్లో బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్‌ తన ''బెల్‌ బాటమ్‌'' చిత్రాన్ని థియేట్రికల్ రిలీజ్ చేయడానికి ముందుకు వచ్చారు. ఏప్రిల్‌ 2 అని, జులై 27వ తేదీ అబీటు5వాయిదా పడుతూ వచ్చిన ఈ చిత్రాన్ని.. ఈరోజు (ఆగస్టు 19) గురువారం ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. ప్రీమియర్స్ తోనే ఈ సినిమా పాజిటివ్ టాక్ తో రన్ అవుతోంది.

ఇందిరాగాంధీ దేశ ప్రధాన మంత్రిగా ఉన్న 1980స్ లో జరిగిన వాస్తవ సంఘటలన ఆధారంగా 'బెల్‌ బాటమ్‌' చిత్రాన్ని రూపొందించారు. రంజిత్‌ ఎం.తివారీ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. పూజా ఎంటర్టైన్మెంట్ మరియు ఎమ్మా ఎంటర్టైన్మెంట్ బ్యానర్స్ పై వషూ భగ్నానీ - జాకీ భగ్నానీ - దీప్షికా దేశ్‌ ముఖ్ - మోనీషా అద్వానీ - మధు భోజ్వానీ - నిఖిల్ అద్వానీ కలిసి ఈ మూవీని నిర్మించారు. ఇందులో వాణీ కపూర్‌ హీరోయిన్ గా నటించగా.. హ్యూమా ఖురేషి - లారాదత్తా ఇతర కీలక పాత్రల్లో కనిపించారు.

'బెల్‌ బాటమ్‌' చిత్రంలో అక్షయ్ కుమార్ ఒక RAW (రా) ఏజెంట్ గా కనిపించారు. హైజాక్ చేయబడిన ఓ విమానాన్ని కనిపెట్టి.. ఎలాంటి ప్రాణనష్టం లేకుండా ప్రయాణికులందరిని భారత గడ్డకు సురక్షితంగా తీసుకొచ్చే పాత్రలో అక్షయ్ ఆకట్టుకున్నాడు. రెట్రో లుక్ లో స్టైలిష్ గా కొత్తగా కనిపించాడు. ఇందులో అక్షయ్ భార్యగా వాణి కపూర్ నటించింది. కథలో ఆమె పాత్రలో ఉండే ట్విస్ట్ ప్రేక్షకులను ఎగ్జైటింగ్ చేసింది. ఇందిరాగాంధీ పాత్రలో లారా దత్తా.. దుబాయ్ లో స్పెషల్ ఏజెంట్ గా హుమా ఖురేషీ మెప్పించారు.

'బెల్‌ బాటమ్‌' సినిమా గ్రిప్పింగ్‌ స్క్రీన్ ప్లే తో ప్రతి క్యారెక్టర్ కు బ్యాక్ స్టోరీ లేదా సడెన్ ట్విస్ట్‌ తో ప్రేక్షకులను అలరిస్తోంది. భారీ స్థాయిలో రూపొందించిన ఈ సినిమా ప్రొడక్షన్ వాల్యూస్ దానికి తగ్గట్టుగానే ఉన్నాయి. సినిమాటోగ్రాఫర్ - ప్రొడక్షన్ డిజైనర్ 1980ల కాలాన్ని తెరపై చూపించడంతో సక్సెస్ అయ్యారు. అలానే మ్యూజిక్ కూడా దీనికి ప్రధాన ఆకర్షణగా నిలిచింది. బ్రిలియంట్ పెరఫార్మన్సేస్ మరియు గ్రిప్పింగ్ స్టోరీ టెల్లింగ్ తో వచ్చిన ''బెల్ బాటమ్'' సినిమా కచ్చితంగా బిగ్ స్క్రీన్ మీద చూడాల్సిన సినిమా అని చెప్పాలి. మరి ప్రస్తుత పరిస్థితుల్లో కలెక్షన్స్ ఏ రేంజ్ లో రాబడుతుందో చూడాలి.