Begin typing your search above and press return to search.

కబీర్ సింగ్ కిస్సు కళాత్మకంగా ఉందిగా..

By:  Tupaki Desk   |   26 May 2019 7:21 AM GMT
కబీర్ సింగ్ కిస్సు కళాత్మకంగా ఉందిగా..
X
'అర్జున్ రెడ్డి' బాలీవుడ్ రీమేక్ 'కబీర్ సింగ్' పై మొదటి నుంచి ఎంతో ఆసక్తి నెలకొంది. షాహిద్ లాంటి టాలెంటెడ్ యాక్టర్ విజయ్ దేవరకొండ పాత్రను చేయడం అందుకు ఒక కారణం అయితే ఒరిజినల్ డైరెక్టర్ సందీప్ వంగానే హిందీ వెర్షన్ కు దర్శకత్వం వహించడం మరో కారణం. షాహిద్ గురించి పెద్దగా తెలియని వాళ్లకు.. 'అర్జున్ రెడ్డి' ఫ్యాన్స్ కు చాలామందికి రీమేక్ పై కొన్ని అనుమానాలు ఉన్నాయి కానీ ప్రోమోస్ వరసగా రిలీజ్ అవుతుంటే వారికి కూడా రీమేక్ కూడా బాగుంటుందనే నమ్మకం వస్తోంది.

ఇప్పటికే ఈ సినిమా టీజర్ ప్రేక్షకులను మెప్పించిన సంగతి తెలిసిందే. రెండు రోజల క్రితం ఈ సినిమా నుండి 'బేఖయాలి మే' అంటూ ప్రేమికురాలు దూరం అయిన తర్వాత కబీర్ సింగ్ వేదన అనుభవించే సమయంలో వచ్చే సాంగ్ ను రిలీజ్ చేశారు. ఒక్క ముక్కలో ఈ పాట ఎలా ఉంది చెప్పాలంటే.. సూపర్బ్. రెండు రోజుల్లోనే ఈ పాటకు 18 మిలియన్ల వ్యూస్ వచ్చాయి. హాఫ్ మిలియన్ లైక్స్. 24 వేల కామెంట్స్. ఇదంతా జస్ట్ టీ సీరీస్ వారి అధికారిక యూట్యూబ్ ఛానల్ లో మాత్రమే. ఈ లెక్కన ఈ బేఖయాలి పాట ఎంత సంచలనం సృష్టించిందో మనం అర్థం చేసుకోవచ్చు. ఇర్షాద్ కమిల్ సాహిత్యం అందించగా సంగీత దర్శకుడు సాచేత్ టాండన్ ఈ పాటను హృద్యంగా పాడాడు.

అయితే పాట ట్యూన్.. సాచేత్ వాయిస్.. ఇవేనా ఈ పాటలో హైలైట్? కాదు బాబోయ్ కాదు. ఈ పాటలో హైలైట్ షాహిద్.. హీరోయిన్ కియారా అద్వానిల మధ్యలో ఎంతో సహజంగా జరిగిన బేమిసాల్ చుమ్మా.. అదేనండి 'సాటిలేని ముద్దు'. బైక్ పై వెళ్తూ ఉంటే కియారా షాహిద్ కు ముద్దు పెట్టడం.. ఇద్దరూ బండి మీద నుంచి కింద పడిపోవడం.. అయినా 'ఆఫ్టర్ ది షార్ట్ కమర్షియల్ బ్రేక్' అన్నట్టుగా మళ్ళీ లిప్ లాకును గట్టిగా.. మునుపటి కంటే గాఢంగా పూర్తి చేయడం.. హిందీ ఆడియన్స్ ను మెస్మరైజ్ చేస్తోంది. మరి తెలుగు ఆడియన్స్ "ఇది 'అర్జున్ రెడ్డి' లో ఉందిగా.. కొత్తగా ఏముంది బొంగు" అని పెదవి విరుస్తారా. అప్పుడు చేసేదేం లేదు.. గోవావైపు తిరిగి దణ్ణం పెట్టడం తప్ప.