Begin typing your search above and press return to search.

మ‌థ‌ర్స్ అయి ఉండీ హ్యాపెనింగ్ స్టార్లుగా..!

By:  Tupaki Desk   |   14 July 2021 11:30 PM GMT
మ‌థ‌ర్స్ అయి ఉండీ హ్యాపెనింగ్ స్టార్లుగా..!
X
పెళ్ల‌యిన త‌ర్వాత న‌టీమ‌ణులుగా కొన‌సాగ‌డం అంటే ఆషామాషీ కాదు. భ‌ర్త అత్త మామ‌ల ప్రోత్సాహం చాలా ముఖ్యం. ఇక బిడ్డ త‌ల్లి అయితే సంసారాన్ని ఈద‌డం ఇంటిని చ‌క్క‌దిద్ద‌డం సైమ‌ల్టేనియ‌స్ గా ఈ బిజీ లైఫ్ ని మ్యానేజ్ చేయ‌డం ఇంకా స‌వాళ్ల‌తో కూడుకున్న‌ది. కానీ ఇంట్లో స‌హ‌కారం ఉంటే ఎలాంటి స‌వాళ్ల‌ను అయినా అధిగ‌మించి స‌త్తా చాట‌తామ‌ని సినీయ‌వ‌నిక‌పై దూసుకెళ‌తామ‌ని నిరూపిస్తున్నారు కొంద‌రు భామ‌లు.

మ‌థ‌ర్స్ అయి ఉండి కూడా హ్యాపెనింగ్ బ్యూటీలుగా రాణిస్తున్న తెలుగు అందాలను ప‌రిశీలిస్తే ఆస‌క్తిక‌ర విష‌యాలే తెలిసాయి. సీనియ‌ర్ యాంక‌ర్ అన‌సూయ ఇద్ద‌రు పిల్ల‌ల త‌ల్లి అని ఎవ‌రైనా అనుకుంటారా..! కానీ అన‌సూయ కిడ్స్ బాధ్య‌త‌ల్ని నిర్వ‌ర్తిస్తూ ఇంటిని చ‌క్క‌దిద్ద‌డ‌మే గాక న‌టీమ‌ణిగానూ రాణిస్తున్నారు. ఇది ఓపెన్ సీక్రెట్ అయినా కానీ.. తాను డైరెక్ట్ హీరోయిన్ గా సినిమాలు చేయ‌డం లేదు క‌నుక మ‌థ‌ర్ అనే టాపిక్ అన‌సూయ కెరీర్ ని పెద్ద‌గా ఇబ్బంది పెట్ట‌డం లేదు. బుల్లితెర వెండితెర‌పై కాల్షీట్ల‌ను మ్యానేజ్ చేసేస్తున్నారు.

అయితే ఊహ తెలిసేంత వ‌య‌సు వ‌చ్చిన పిల్ల‌ల‌కి త‌ల్లులై ఉండి కూడా ఆ రిలేష‌న్ ని సీక్రెట్ గా ఉంచుతూ ఇండ‌స్ట్రీలో హీరోయిన్లుగా రాణించ‌డానికి ప్ర‌య‌త్నాలు చేస్తున్న భామ‌లు లేక‌పోలేదు. టాక్సీవాలా హీరోయిన్ ప్రియాంక జవాల్క‌ర్ కి ఓ కూతురు ఉంది అంటే న‌మ్మ‌గ‌ల‌రా? ఇది చాలా మందికి తెలియ‌నిది. యూఎస్ రిట‌ర్న్ గా వ‌చ్చిన ఈ బ్యూటీకి ఓ పాప‌కి త‌ల్లి... అయితే త‌ల్లిగా ఆ పాప‌కి ఆల‌నా పాల‌న చూసుకుంటూనే హీరోయిన్ గా ప‌లు సినిమాల్లో న‌టిస్తోంది. ప్రియాంక న‌టించిన తిమ్మ‌రుసు త్వ‌ర‌లో రిలీజ్ కానుంది. ఈ సీజ‌న్ లోనే న‌వ‌త‌రం హీరో స‌ర‌స‌న న‌టించిన‌ మ‌రో సినిమా `ఎస్.ఆర్ క‌ళ్యాణ మండ‌పం` కూడా రిలీజ్ బ‌రిలో ఉంది.

అలానే మ‌రో హ్యాపెనింగ్ తెలుగు బ్యూటీ పూజిత పొన్నాడ‌కి ప‌న్నేండేళ్ల‌ బాబు ఉన్నాడు. తాను కూడా ఆ చిన్నారిని పెంచుతూనే ఇండ‌స్ట్రీలో ఎద‌గాల‌ని ట్రై చేస్తున్నారు. అన‌సూయ‌- పూజిత- ప్రియాంక జవాల్క‌ర్ లాంటి నటీమ‌ణులు వ‌రుస ఫోటోషూట్ల‌తో ఇండ‌స్ట్రీలో నిరంతరం గుబులు పెంచుతున్న తీరు హాట్ టాపిక్ గా మారుతోంది.

ప‌రిశ్ర‌మ‌లో బిడ్డ త‌ల్లులు అయి ఉండీ రాణిస్తున్న న‌టీమ‌ణులెంద‌రో. ఇండ‌స్ట్రీని అగ్ర క‌థానాయిక‌గా ఏలిన రోజా శ్రీ‌మ‌తి అయ్యాకా బుల్లితెర వెండితెర‌పై రాణించారు. రాజ‌కీయాల్లోనూ త‌న‌దైన స‌త్తా చాటుతున్నారు. త‌న‌కు హీరోయిన్ అయ్యేంత ఎదిగేసిన కుమార్తె అన్షు ఉన్నారు. కృష్ణ లోహిత్ అనే కుమారుడు ఉన్నారు. రోజా సెల్వ‌మ‌ణి జ‌బ‌ర్ధ‌స్త్ జ‌డ్జిగా అల‌రిస్తున్నారు.

ఒక‌ప్ప‌టి అగ్ర క‌థానాయిక మీనా పెళ్లాడాకా న‌టీమ‌ణిగా కొన‌సాగుతున్నారు. నైనిక త‌న కుమార్తె పేరు. స్నేహ‌.. న‌జ్రియా న‌జీమ్ .. క‌రీనా క‌పూర్ ఖాన్.. అనిత హ‌స‌నందానీ .. వీళ్లంతా బిడ్డ తల్లులుగా సుప‌రిచితం. వీరంతా పెళ్ల‌యి పిల్ల‌ల్ని క‌న్నాకా న‌టీమ‌ణులు గా రాణిస్తున్నారు. ఐశ్వ‌ర్యారాయ్- అనుష్క శ‌ర్మ‌-శిల్పా శెట్టి- మ‌లైకా అరోరా లాంటి సీనియ‌ర్ తార‌లు పెళ్ల‌యి పిల్ల‌లు ఉన్నా ఆర్జ‌కులుగా వెలిగిపోతున్నారు. రాశీ- రంభ లాంటి తార‌లు పెళ్ల‌యి పిల్ల‌ల‌కు త‌ల్లులు అయినా ఇంకా ప‌రిశ్ర‌మ‌లో కంబ్యాక్ తో అభిమానుల‌ను ప‌ల‌క‌రించ‌డం చూస్తున్న‌దే.

ఇక అతిలోక సుంద‌రి శ్రీ‌దేవి ఇంగ్లీష్ వింగ్లీష్ తో కంబ్యాక్ అయిన తీరు తెలిసిన‌దే. త‌న వార‌సురాలు జాన్వీ క‌పూర్ ఇండ‌స్ట్రీలో స్టార్ హీరోయిన్ గా ఎదిగేస్తోంది. ఖుషీ క‌పూర్ క‌థానాయిక అయ్యేందుకు సిద్ధంగా ఉంది. బాలీవుడ్ లో చాలామంది స్టార్ వైవ్స్ వెబ్ సిరీస్ లు సినిమాలు చేస్తూ ఇప్ప‌టికీ హ్యాపెనింగ్ బ్యూటీస్ గానే వెలిగిపోతుండ‌డం చూస్తున్న‌దే. సౌత్ తో పోలిస్తే ఉత్త‌రాదిన కెరీర్ ప‌రంగా ఏ డోఖా లేకుండా ఎదిగేస్తున్న భామ‌ల‌కు కొద‌వేమీ లేదు.