Begin typing your search above and press return to search.

ప్రెగ్నెంట్‌ అని కూడా చూడకుండా నీచంగా ప్రవర్తించారు

By:  Tupaki Desk   |   5 Jan 2021 7:00 AM IST
ప్రెగ్నెంట్‌ అని కూడా చూడకుండా నీచంగా ప్రవర్తించారు
X
హీరోయిన్‌ సమీరా రెడ్డి ప్రస్తుతం ఇద్దరు పిల్లలకు తల్లి. ఆమె తెలుగుతో పాటు పలు భాషల్లో సినిమాలు చేసింది. కనుక ఆమె కు మంచి గుర్తింపు అయితే ఉంది. సోషల్‌ మీడియాలో ఆమెను కోట్లాది మంది ఫాలో అవుతూ ఉన్నారు. కనుక రెగ్యులర్‌ గా ఆమె పోస్ట్ లు పెడుతూనే ఉంటుంది. సినిమాల్లో చేసినా చేయకున్నా కూడా సోషల్ మీడియా కారణంగా ఆమె ఎప్పుడు జనాల్లోనే ఉన్నట్లుగా అనిపిస్తుంది. పిల్లలు పెద్ద వారు అయిన తర్వాత ఖచ్చితంగా సినిమాల్లోకి ఎంట్రీ ఇస్తానంటూ చెబుతున్న సమీరా రెడ్డి ఇటీవల ఒక ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలను వెళ్లడించింది. ప్రెగ్నెన్సీ సమయంలో తాను పడ్డ మానసిక క్షోభ గురించి ఆమె ప్రత్యేకంగా చెప్పింది.

అమ్మ అవ్వాలనే కోరిక ఉన్నప్పటికి ప్రగ్నెంట్‌ గా ఉన్న సమయంలో నాలో వచ్చే మార్పులకు నేను సిద్ద పడలేదు. దాంతో నా మొదటి ప్రెగ్నెన్సీ సమయంలో నాకు నేనే నచ్చక పోవడం.. నా గురించి జనాలు మాట్లాడే మాటలు బాధ కలిగించడం విపరీతమైన కోపం రావడం జరిగేది. నేను ప్రెగ్నెంట్‌ గా ఉన్న సమయంలో కూడా కొందరు నా బాడీ షేమింగ్‌ గురించి ట్రోల్‌ చేశారు. ఆ సమయంలో నాకు చాలా బాధ కలిగింది. రెండవ ప్రెగ్నెన్సీ సమయంలో అలాంటిది ఏమీ లేదు.

నేను అమ్మను అయ్యాను అనే సంతోషం ముందు అవి ఏమీ నిలువలేదు. ఇద్దరు పిల్లలకు తల్లిని అయిన నేను మునుపటి రూపంలోకి వచ్చేందుకు కాస్త సమయం పడుతుంది. ఆ విషయం గురించి ప్రస్తుతం నాకు ఎలాంటి ఆలోచన లేదు. నా పిల్లల గురించే నా ఆలోచన అంతా అంది. మునుపటి రూపంకు వచ్చిన తర్వాత సమీరా రెడ్డి మళ్లీ నటిగా బిజీ అవ్వాలనుకుంటుందట.