Begin typing your search above and press return to search.

ట్రైలర్ టాక్‌: బేఫికరుగా 'అన్నీ' కానిచ్చెయ్

By:  Tupaki Desk   |   11 Oct 2016 3:50 AM GMT
ట్రైలర్ టాక్‌: బేఫికరుగా అన్నీ కానిచ్చెయ్
X
''ప్రేమ అనే పదాన్ని ఎక్స్ ప్రెస్ చేస్తే.. అనవసరంగా ఎమోషనల్ గా సెంటిమెంటల్ గా ఎటాచ్ అవ్వాల్సి ఉంటుంది. అలా 'ఐ లవ్ యు' అని చెప్పకుండా చక్కగా మిగతా పనులన్నీ కానిచ్చేస్తేనే బెటర్''- సరిగ్గా ఇదే థీమ్ తో రూపొందిన సినిమా ''బేఫికర్''. గత కొద్ది నెలల నుండి ప్రతీ నెలా 9వ తారీఖున లిప్ లాక్ పోస్టర్లతో అల్లరి చేస్తున్న ఈ సినిమా ట్రైలర్ ఎట్టకేలకు నిన్న ప్యారిస్ ఐఫెల్ టవర్ దగ్గర రిలీజ్ చేశారులే. పదండి చూద్దాం.

చాన్నాళ్ళకు దర్శకత్వ పగ్గాలు చేపట్టాడు ఆదిత్య చోప్రా. మనోడి ట్రాక్ రికార్డు బీభత్సంగా ఉంటుంది కాబట్టి.. ఈ సినిమా ఎలా ఉండబోతోందో అంటూ అందరూ వేయి కళ్లతో ఎదురు చూస్తున్నారు. ఇక సినిమా అంతా కూడా.. హీరో రణవీర్ సింగ్ అండ్ సెక్సిణి వాణి కపూర్ లు.. ఐ లవ్యూ అనే పదం చెప్పుకోకుండా మనం కలసి ఉండిపోదాం అంటూ లిప్ లాకుల నుండి శృంగారం వరకు అన్నీ కానిచ్చేస్తుంటారు. ప్యారిస్ మొత్తంగా తిరిగిస్తూ.. ఎక్కడిపడితే అక్కడ ఆవిడ బికినీల్లో దర్శనమివ్వడం.. లేదంటే ఏదైనా మీటింగులో టాప్ విప్పేసి బ్రా తో టీజ్ చేయడం.. మనోడైతే ఏకంగా బట్టలన్నీ తీసేసి అండర్ వేర్ మీద స్ర్టిప్ టీజ్ చేయడం.. ఇదండీ వరుస. ''బేఫికర్'' సినిమాలో మాటల కంటే ఎక్కువగా ముద్దులే ఉన్నాయని అనుకోవాలేమో. హద్దులు చెరిపేసి ఎంజాయ్ చేయాలి అనే థీమ్ ను చాలా ఘనంగా తెరకెక్కించాడనుకుంట దర్శకుడు.

ట్రైలర్ గురించి ఇంకా చెప్పుకోవాలంటే.. ముఖ్యంగా కనేమ్ ఒనోయెమా అందించిన సినిమాటోగ్రాఫీ టాప్ నాచ్ గా ఉంది. అలాగే విశాల్-శేఖర్ మ్యూజిక్ కూడా అరిపించారులే. ట్రైలర్ చాలా సింపుల్ గా ఉన్నప్పటికీ.. యువతను ఆకట్టుకునే అంశాలు చాలా ఉన్నాయ్ కాబట్టి.. యుట్యూబ్ లో వైరల్ అయ్యే ఛాన్సుంది. ఇక డిసెంబర్ 9న ధియేటర్లలో ఉండమంటున్నాడు ఆదిత్య చోప్రా.. అదే ''బేఫికర్'' చూసి పాడైపోవడానికట.



Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/