Begin typing your search above and press return to search.

బేఫికర్.. ఇండియాలో ఫస్ట్ టైం రికార్డ్!

By:  Tupaki Desk   |   11 Nov 2016 12:24 PM GMT
బేఫికర్.. ఇండియాలో ఫస్ట్ టైం రికార్డ్!
X
రణవీర్ సింగ్.. వాణి కపూర్ లు జంటగా నటిస్తున్న బేఫికర్ మూవీపై చాలానే హోప్స్ ఉన్నాయి. సినిమా స్టోరీ కంటే ఎక్కువగా.. వీళ్లిద్దరి రొమాన్స్ ఎలా ఉంటుందనేదే మెయిన్ టాపిక్. అంతకు మించి ఆసక్తి కలిగించే విషయం ఏంటంటే.. రణవీర్-వాణిల ముద్దు సీన్స్ ఎంత రంజుగా ఉంటాయా అనుకుంటున్నారు సినీజనాలు. ఇప్పుడీ మూవీ ఓ అరుదైన రికార్డు సాధించింది.

నిజానికి ఇది అరుదైన కాదు.. ఇండియాలోనే మొదటిసారిగా ఓ మూవీ సాధించిన ఘనత. అదే.. సినిమా కోసం ఎమోజీ రూపొందించడం. ట్విట్టర్ ఎమోజీలు ఎంత ఫేమస్ అనే సంగతి చెప్పక్కర్లేదు. కానీ బేఫికర్ సినిమా కోసం ట్విట్టర్ వాళ్లు ఎమోజీ రూపొందించి అందించారట. ఈ విషయాన్ని స్వయంగా ఆ టీం ఎమోజీ సింబల్ తో పాటు పోస్ట్ చేసింది. ప్రమోషన్ కోసం ట్విట్టర్ లో ఎమోజీనే తెచ్చుకున్నారంటే.. ఈ బేఫికర్ కి ప్రచారం హంగామా ఏ రేంజ్ లో ఉంటుందనే విషయాన్ని ఊహించుకోవచ్చు.

ఇప్పటివరకూ ఏ ఇండియన్ మూవీకి చేయని టైపులో పబ్లిసిటీ చేయనున్నారని చెప్పుకుంటున్నారు. ఇందుకోసం యష్ రాజ్ ఫిలిమ్స్ కు ఉన్న నెట్వర్క్ మొత్తాన్ని వినియోగిస్తారని తెలుస్తోంది. ప్రచారం సంగతి అలా పెడితే.. ఇప్పటికే రిలీజ్ అయిన పాటలు.. మేకింగ్ వీడియోలు చేస్తున్న రచ్చ మామూలుగా లేదు. ఇండియన్ సినిమా స్క్రీన్ కొత్త అందాలను కాదు కానీ.. కొత్త అనుభూతులను బేఫికర్ మిగల్చడం ఖాయం అంటోంది యష్ రాజ్ ఫిలిమ్స్.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/