Begin typing your search above and press return to search.

వీడియో టాక్‌ః బీచ్ బీచ్ మే బాగుంది

By:  Tupaki Desk   |   4 July 2017 12:26 PM IST
వీడియో టాక్‌ః బీచ్ బీచ్ మే బాగుంది
X
ఈ ఏడాది “రయీస్” సినిమాలో గుజరాతీ డాన్ లా కనిపించి ఏ వ్యాపారం చిన్నది కాదు పెద్దదైన ఏ వ్యాపారంలోనూ ధర్మం ఉండదు అని అందరిని తన స్టైల్ తో అలరించాడు షారూఖ్ ఖాన్. ఇప్పుడు మరోసారి తనకు మాత్రమే సొంతమైన రొమాంటిక్ కామిడీ తో ప్రేక్షకులు ముందుకు రాబోతున్నాడు. ‘జబ్ హ్యారి మెట్ సెజల్’ సినిమా ఇప్పటికే దేశంలో ఉన్న యూత్ అంతా ఎప్పుడుప్పుడు సినిమా చూద్దామా అన్నంత ఆశక్తితో ఉన్నారు.

ఇకపోతే మొన్న ‘రాధా’ పాటను కూడా దేశంలో ఉన్న సెజల్ అనే పేరుగల అమ్మాయిలను వెతికిమరి వాళ్ళచే పాట విడుదల చేశాక.. ఇప్పుడు ఒక క్లబ్ సాంగ్లో డిస్కో చేస్తూ యూరోప్ దేశ వీధులలో బ్యూటిఫుల్ లేడీ అనుష్క శర్మతో కలసి పరుగులు పెడుతూ కనిపించాడు కింగ్ ఖాన్. ఈ సినిమాలోని “బీచ్ బీచ్ మే” పాటను నిన్ననే విడుదల చేశారు. ఇరువరి మధ్య ఫన్ వాళ్ళు చేసిన డాన్స్ చూస్తే.. చూసేవాళ్ళకి కూడా బీట్ తగట్టు ఆడాలి అనిపిస్తుంది. చాల సినిమాలు తరువాత షారూక్ ఖాన్ తన రిలాక్స్ కూల్ స్టైల్లో కనిపిస్తున్నాడు. అనుష్క తన ఎనర్జి తో పాటలో మరింత ఎనర్జి తీసుకువచ్చింది. ఈ పాటలో షారూక్ ఖాన్, అనుష్క శర్మా ఇంతియాజ్ ఆలీ సృస్టించిన ప్రేమ ప్రపంచంలో స్వేచ్ఛగా చెలిరేగి ఆటలు ఆడుకుంటున్నారు. ప్రీతమ్ అందించిన మ్యూజిక్ కి ఆర్జిత్ సింగ్ గొంతు అదిరింది.

జబ్ హ్యారి మెట్ సెజల్ సినిమాలో అనుష్క కు పెళ్లి ఫిక్స్ అయన తరువాత షారూక్ ని యూరోప్ లో కలిసి తరువాత ఆ పరిచయం ఎలా మలుపులు తిరగబోతుందో ఆగష్టు 4 న మనం చూడవచ్చు. షారూక్ ఖాన్ ఈ సినిమాలో యూరోప్ టూర్ గైడ్ గా కనిపించబోతునట్లు తెలుస్తోంది. ఈ మధ్య కాలంలో సరైన హిట్టు లేని షారూఖ్‌.. ఈ ప్రేమకథతో ఆకట్టుకుంటాడేమో చూడాలి.



Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/