Begin typing your search above and press return to search.

ఒక్కో బ్యూటీ ప్ర‌మోష‌న్ కి ఆర్జీవీకి ఎంత ముడుతోంది?

By:  Tupaki Desk   |   2 Sep 2021 5:44 AM GMT
ఒక్కో బ్యూటీ ప్ర‌మోష‌న్ కి ఆర్జీవీకి ఎంత ముడుతోంది?
X
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానుల‌ను కెల‌క‌నిదే ఆర్జీవీ అస్స‌లు నిదుర‌పోలేరు. ఆయ‌నకు నిత్య‌కృత్య‌మిది. త‌న ప్ర‌త్య‌ర్థుల‌కు మ‌న‌శ్శాంతి లేకుండా ఏదో ఒక‌టి చేయ‌డం ద్వారా ఉచిత‌ ప‌బ్లిసిటీ కొట్టేయాల‌ని ప‌న్నాగం ప‌న్నుతారు. అయితే దీనికి ప‌వ‌న్ అభిమానులు చేసే ర‌చ్చ అంతే ఇదిగా ఉంటుంది. ఇప్పుడు మ‌రోసారి ఆర్జీవీ చేసిన ప‌నికి ప‌వ‌ర్ స్టార్ అభిమానుల సోష‌ల్ మీడియా రుస‌రుస‌లు హాట్ టాపిక్ గా మారాయి. ఇంత‌కీ ఆర్జీవీ ఏం ర‌చ్చ చేశారు? అంటే..!

ఆర్జీవీ ఇటీవ‌ల వ‌రుస‌గా ప‌లువురు ఔత్సాహిక యువ‌క‌థానాయిక‌ల‌ను ప్ర‌మోట్ చేస్తున్న సంగ‌తి తెలిసిందే. ఇటీవ‌లే బిగ్ బాస్ బ్యూటీ అరియానాను గొప్ప‌గా ప్ర‌మోట్ చేశారు. ప‌లువురు యువ‌క‌థానాయిక‌ల‌తో ఆయ‌న డ్యాన్సులు స్టెప్పులు అంత‌ర్జాలంలో వైర‌ల్ అవ్వ‌డం ద్వారా స‌ద‌రు అంద‌గ‌త్తెల‌కు బోలెడంత ప్ర‌మోష‌న్ ద‌క్కింది. ఇక ఆర్జీవీ ఢీ కొంపెనీ నాయిక‌ల‌కు లేట్ నైట్ పార్టీల పేరుతో గొప్ప ప్ర‌చారం చేసి పెట్టారు ఆర్జీవీ.

ఇప్పుడు మ‌రో బిగ్ బాస్ బ్యూటీ అషురెడ్డి వంతు. అషు త‌న వీపు వెన‌క‌భాగంలో కుడివైపున ఓ టాట్టూ వేయించుకోగా.. ఆ టాట్టూపై ఫోక‌స్ చేస్తూ ఆర్జీవీ జూమ్ చేసిన ఫోటోగ్రాఫ్ ఒక‌టి అంత‌ర్జాలంలో వైర‌ల్ అవుతోంది. ఈ ఫోటోని ఆర్జీవీ జూమిన్ ట్విట్ట‌ర్ లో షేర్ చేశారు. నేడు ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్ పుట్టిన‌రోజు సంద‌ర్భంగా ఆర్జీవీ శుభాకాంక్ష‌ల్ని డిఫ‌రెంటుగా ప్లాన్ చేశారిలా.

``పవన్ కళ్యాణ్ అభిమానుల తరపున…ఆయనను అభిమానించే అషు రెడ్డి తరపున పవన్ కళ్యాణ్ కు అడ్వాన్స్ హ్యాపీ బర్త్ డే…. అషుతో నా ఇంటర్వ్యూ ప్రోమో సెప్టెంబర్ 2 న 6 పీఎం విడుదలవుతుంది. జై పవన్ కళ్యాణ్.. జై అషు రెడ్డి`` అంటూ వర్మ ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ పై ప‌వ‌న్ ఫ్యాన్స్ తీవ్రంగా మండి ప‌డుతున్నారు. అషు రెడ్డిని తూర్పారబ‌డుతున్నారు. అయితే త‌న‌ని నిందించే వారికి అషు త‌న‌దైన శైలిలో స‌మాధానాలిస్తూ వేడి పెంచుతున్నారు. మొత్తానికి స‌రైన టైమింగ్ చూసి అషుకి ప్ర‌చారం చేసి పెడుతున్న ఆర్జీవీ ధ‌న్యుడు!! అన్న‌ట్టు ఇలా క‌థానాయిక‌లంద‌రికీ ప్ర‌మోష‌న్ చేసి పెడుతున్న ఆర్జీవీ ఎంత సంపాదించి ఉంటారు? ఒక్కో బ్యూటీ ప్ర‌మోష‌న్ కి ఆర్జీవీకి ఎంత ముడుతోంది? అంటూ ప‌లువురు ఆరా తీస్తుండ‌డం కొస‌మెరుపు.