Begin typing your search above and press return to search.

ఫోటో స్టొరీ: పోజు నచ్చలేదంటున్నారే!

By:  Tupaki Desk   |   13 Aug 2019 6:20 AM GMT
ఫోటో స్టొరీ: పోజు నచ్చలేదంటున్నారే!
X
డింపుల్ బ్యూటీ తాప్సీ పన్ను ఫిలిం ఇండస్ట్రీలో అడుగుపెట్టి ఇప్పటికి 9 ఏళ్ళు అయింది. తాప్సీ మొదటి సినిమా 'ఝుమ్మంది నాదం'. ఆ తర్వాత టాలీవుడ్ లో పలు విజయవంతమైన చిత్రాల్లో నటించిది. 'Mr. పర్ఫెక్ట్' లాంటి సూపర్ హిట్స్ కూడా అందులో ఉన్నాయి. తాప్సీ ఖాతాలో కొన్ని హిట్స్ ఉన్నప్పటికీ టాలీవుడ్ లో ఎందుకో స్టార్ హీరోయిన్ గా పేరు తెచ్చుకోలేకపోయింది. కానీ బాలీవుడ్ జర్నీ మాత్రం ఫుల్ గా కలిసొచ్చింది. 'పింక్' లాంటి చిత్రంతో మంచి బ్రేక్ రావడంతో తనకంటూ ప్రత్యేకమైన మార్కెట్ సృష్టించుకుంది. రీసెంట్ గా 'బద్లా' తో కూడా మరో సూపర్ హిట్ ను తన ఖాతాలో వేసుకుంది. బాలీవుడ్ లో తన సత్తా చూపడంతో పాటుగా ఈ భామ సోషల్ మీడియాలో కూడా దుమ్ము లేపుతోంది.

తాప్సీకి ఇన్స్టాలో 12.4 మిలియన్ ఫాలోయర్స్ ఉన్నారు. రెగ్యులర్ గా ఏదో ఒక అప్డేట్ ఇస్తూ అభిమానులతో నిత్యం టచ్ లో ఉంటుంది. ఒక్కోసారి హాట్ ఫోటో షూట్లతో నెటిజన్లను థ్రిల్ చేస్తుంది. తాప్సీ రీసెంట్ గా ఎలి మ్యాగజైన్ కోసం ఒక ఫోటో షూట్ చేసింది. ఆ ఫోటో షూట్ నుంచి ఒక ఫోటోను తన ఇన్స్టా ఖాతా ద్వారా పోస్ట్ చేసింది. ఈ ఫోటోకు "కామ్" అనే క్యాప్షన్ ఇచ్చింది. ఈ బ్లాక్ అండ్ వైట్ ఫోటోలో తాప్సీ నేలపై కూర్చొని ఒక హాట్ పోజిచ్చింది. స్లీవ్ లెస్ డ్రెస్.. డీప్ వీ నెక్ ఉండడంతో ఆటోమేటిక్ గా అందాల ప్రదర్శన జరిగిపోయింది. రింగుల జత్తును కాస్త చిందరవందరగా స్టైలింగ్ చేయడంతో కళాత్మకంగా ఉంది. తాప్సీ మొదటి నుంచి స్లిమ్ బ్యూటీ.. ఇప్పుడు బాలీవుడ్ హీరోయిన్ గా సెటిల్ కావడంతో జీరో సైజ్ లో ఉంది. ఓవరాల్ గా ఫోటో మోడరన్ గా ఉంది.

ఈ ఫోటోకు నెటిజన్లు ఎన్నో కామెంట్లు పెట్టారు. "ఇలాంటి పిక్ చూసి కామ్ గా ఎలా ఉండాలి?".."స్టన్నింగ్ పిక్".. "ఫోటో నచ్చలేదు".. "ఇలాంటి ఫోటోలు పోస్ట్ చెయ్యకు" అంటూ మిక్స్డ్ టాక్ వచ్చింది. మరి స్లోగా ఈ ఫోటో కల్ట్ స్టేటస్ అందుకుందేమో చూడాలి! ఇక తాప్సీ ఫ్యూచర్ ప్రాజెక్టుల విషయానికి వస్తే 'మిషన్ మంగళ్'.. 'సాంద్ కి ఆంఖ్' విడుదలకు రెడీగా ఉన్నాయి. మరో చిత్రం 'తడ్కా' చివరి దశ షూటింగ్ లో ఉంది.