Begin typing your search above and press return to search.

చెమ‌ట‌లు పట్టిస్తున్న ఇలియానా టోన్డ్ బాడీ

By:  Tupaki Desk   |   19 July 2022 4:36 AM GMT
చెమ‌ట‌లు పట్టిస్తున్న ఇలియానా టోన్డ్ బాడీ
X
టోన్డ్ బాడీతో చెమ‌ట‌లు ప‌ట్టించ‌డంలో ఇలియానా త‌ర్వాతే! ప‌ర్ఫెక్ట్ ఫిట్ లుక్ తో ఈ గోవా బ్యూటీ యువ‌త‌రం గుండెల్ని దోచేస్తోంది. సోష‌ల్ మీడియాల్లో ఇలియానా స్పీడ్ గురించి చెప్పాల్సిన ప‌ని లేదు. నిరంత‌రం బీచ్ బికినీ ఫెస్టివల్స్ లో వ‌రుస ఫోటోషూట్ల‌తో ఇన్ స్టాని నింపేస్తోంది. ఇంత‌కుముందే క‌త్రిన కైఫ్ బ‌ర్త్ డే పార్టీలో ఇలియానా సంద‌డి చేసింది. అనూహ్యంగా క‌త్రిన బీచ్ పార్టీలో ఈ బ్యూటీ జాయిన‌వ్వ‌డం ఆశ్చ‌ర్య‌ప‌రిచింది. ఆ త‌ర్వాత దానికి కార‌ణాన్ని ప్ర‌ముఖ బాలీవుడ్ మీడియాలు బ‌య‌ట‌పెట్టాయి. క‌త్రిన సోద‌రుడు లండ‌న్ బిజినెస్ మేన్ తో ఇలియానా ఎఫైర్ క‌హానీ గురించి క‌థ‌నాలు వెలువ‌డ్డాయి.

అయితే దీనిపై ఇలియానా కానీ క‌త్రిన కుటుంబీకులు కానీ స్పందించ‌లేదు. ప్ర‌స్తుతానికి ఇలియానా బికినీ బీచ్ సెల‌బ్రేష‌న్స్ నుంచి వ‌రుస ఫోటోలు అంత‌ర్జాలంలో వేడి పెంచుతున్నాయి. మండే ఎండలో చెమ‌ట‌లు ప‌ట్టిన టోన్డ్ బాడీతో క‌నిపించింది ఈ బ్యూటీ. ఇల్లీ టూ హాట్ గా ఉందంటూ ఈ ఫోటోపై కామెంట్లు వినిపిస్తున్నాయ్. అలా ఎండ‌లో శ‌రీరాన్ని ఆర‌బెడుతూ..క‌ళ్ల‌కు బ్లాక్ గాగుల్స్ ధ‌రించి ఇలా టాప్ యాంగిల్ లో ఫోజులిచ్చింది. ప్ర‌స్తుతం ఈ టూపీస్ లుక్ అంత‌ర్జాలంలో వైర‌ల్ గా మారుతోంది. ఇలియానా నెవ్వ‌ర్ బిఫోర్ హాట్ లుక్ ఇది అన్న కాంప్లిమెంట్స్ అందుకుంటోంది.

సింగిల్ స్టాట‌స్ కి అలా చెక్ గోవా బ్యూటీ ఇలియానా సింగిల్ స్టాట‌స్ కి బ్రేక్ ప‌డింది. అంటే అవున‌నే గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి. ఇలియానా డి క్రజ్ మళ్లీ ల‌వ్ లో ప‌డింది. తాజా గాసిప్స్ ప్ర‌కారం.. అందాల‌ ఇల్లీ ప్ర‌ముఖ క‌థానాయిక‌ కత్రినా కైఫ్ సోదరుడు సెబాస్టియన్ లారెంట్ మిచెల్ తో డేటింగ్ చేస్తోందని గుస‌గుస వినిపిస్తోంది. సెబాస్టియన్ - ఇలియానా జంట‌ సుమారు ఆరు నెలలుగా రిలేషన్ షిప్ లో ఉన్నట్లు తెలుస్తోంది.

ఈ జంట బాంద్రాలోని కత్రిన నివ‌శించే పాత నివాసం సబర్బ్ లో.. ఇలియానా ప్యాడ్ (నివాసం)లో.. అలాగే లండన్ లో ర‌హ‌స్య భేటీల కోసం ఎంచుకున్నట్లు సోర్సెస్ వెల్ల‌డిస్తున్నాయ‌ని ప్ర‌ముఖ‌ బాలీవుడ్ మీడియా క‌థ‌నాన్ని వెలువ‌రించింది. ఇన్ స్టాలో ఈ ఇద్ద‌రి మ‌ధ్యా ప‌ర‌స్ప‌ర స‌మాచార మార్పిడి జ‌రుగుతోంది. తన ఖాతాను ప్రైవేట్ గా ఉంచుకునే సెబాస్టియన్ ను ఇలియానా చాలా కాలంగా అనుస‌రిస్తోంది. ఇరువురూ ఇన్ స్టాగ్రామ్ లో ఒకరినొకరు అనుసరిస్తున్నారు.

క‌త్రిన‌తో మాల్దీవుల పార్టీలో చాలా విష‌యాలు బ‌హిర్గ‌త‌మ‌య్యాయి. ఇన్ స్టాగ్రామ్ లో ఇలియానా స్వ‌యంగా.. కత్రినా- విక్కీ కౌశల్.. సెబాస్టియన్.. ఇసాబెల్లె (క‌త్రిన సోద‌రి)- ఆనంద్ తివారీ - మినీ మాధుర్‌లతో కూడిన ఫోటోను పోస్ట్ చేయ‌డంతో సంథింగ్ ఏదో జ‌రుగుతోంద‌ని కూడా కొంద‌రు అనుమానించారు. ఇలియానా గతంలో ఫోటోగ్రాఫర్ ఆండ్రూ నీబోన్ తో రిలేషన్ షిప్ లో ఉన్న సంగ‌తి తెలిసిందే. కొన్నేళ్ల డేటింగ్ అనంత‌రం వీరు విడిపోయారు. అత‌డితో డేటింగ్ వ్య‌వ‌హారంపై ఇలియానా ఓపెనైనా కానీ బ్రేకప్ అనంత‌రం ఎందుక‌నో మౌనాన్ని ఆశ్ర‌యించింది. ఆ త‌ర్వాత ఇలియానా డిప్రెష‌న్ స్టోరీ.. యోగా క‌స‌ర‌త్తుల‌తో కంబ్యాక్ గురించి తెలిసిందే. ఇప్పుడిప్పుడే ఇలియానా తిరిగి కోలుకుంటోంది. ఇంత‌లోనే కొత్త డేటింగ్ మొద‌లైంది. సెబాస్టియన్ లండన్ లో నివాసముంటున్న మోడల్ అని తెలిసింది.

కెరీర్ మ్యాట‌ర్ కి వ‌స్తే... ఇలియానా చివరిసారిగా అభిషేక్ బచ్చన్ తో కలిసి 'ది బిగ్ బుల్'లో కనిపించింది. ఈ చిత్రం 1992 నాటి స్టాక్స్ సెక్యూరిటీ స్కామ్ ఆధారంగా రూపొందింది. తదుపరి 'అన్ ఫెయిర్ ఎన్ లవ్లీ'లో కనిపించనుంది. ఇది ఫెయిర్ స్కిన్ పై భారతదేశం అభిరుచికి సంబంధించిన కామిక్ కాప‌ర్. హర్యానా నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రంలో రణదీప్ హుడా సరసన ఇలియానా నటిస్తోంది. ఇంకా టైటిల్ నిర్ణ‌యించ‌ని వేరొక హిందీ చిత్రంలో విద్యాబాలన్- ప్రతీక్ గాంధీ- ఇండియన్-అమెరికన్ సంచలనం సెంధిల్ రామమూర్తితో కలిసి ఇలియానా న‌టించ‌నుంది.