Begin typing your search above and press return to search.

కొత్త ఇంట్లో అడుగుపెట్టిన బుట్టబొమ్మ..!

By:  Tupaki Desk   |   22 Jan 2022 5:00 AM IST
కొత్త ఇంట్లో అడుగుపెట్టిన బుట్టబొమ్మ..!
X
ప్రస్తుతం టాలీవుడ్ స్టార్ హీరోయిన్లలో ఒకరిగా వెలుగొందుతోంది పూజా హెగ్డే. బ్యాక్ టూ బ్యాక్ హిట్లు కొడుతూ వరుస అవకాశాలతో దూసుకుపోతోంది. ఓవైపు స్టార్ హీరోలతో చేస్తూనే మరోవైపు కుర్ర హీరోలతో రొమాన్స్ చేస్తోంది. పూజ పట్టిందల్లా బంగారం అవుతుండటంతో అమ్మడి డేట్స్ కోసం అగ్ర హీరోలు కూడా వేచి చూసే పరిస్థితి వచ్చింది. డిమాండ్ కు తగ్గట్టుగానే రెమ్యునరేషన్ తీసుకుంటున్న ఈ బ్యూటీ బాగానే సంపాదించిందని తెలుస్తోంది.

కొన్ని నెలల క్రితం పూజాహెగ్డే ముంబయిలో కొత్త ఇంటి నిర్మాణాన్ని చేపట్టిన సంగతి తెలిసిందే. సముద్రానికి ఎదురుగా ఆధునిక హంగులతో విలాసవంతంగా ఈ ఇంటిని నిర్మించారు. దీనికి సంబంధించిన ఇంటీరియల్ డిజైన్ ను పూజా దగ్గరుండి చూసుకున్నట్లు తెలుస్తోంది. అప్పట్లో తన న్యూ హౌజ్ ఫోటోలను స్టార్ హీరోయిన్ సోషల్ మీడియాలో షేర్ చేసింది. అయితే ఇప్పుడు ముంబైలో కొత్త ఇంటి నిర్మాణం పూర్తవడంతో పూజా తన ఫ్యామిలీతో కలిసి గృహ ప్రవేశం చేసింది.

ముంబైలో హౌస్ వార్మింగ్ ఫంక్షన్ కు సంబంధించిన ఓ ఫోటోని పూజా హెగ్డే ఇన్స్టాగ్రామ్ లో పంచుకుంది. ''కలలన్నీ నెరవేరినందుకు కృతజ్ఞతలు. మిమ్మల్ని మీరు నమ్ముకోండి.. కష్టపడి పని చేయండి. అప్పుడు ఈ విశ్వం నిజంగా మొండి హృదయంతో ప్రేమలో పడుతుంది. ముందుకు పైపైకి'' అని పూజా హెగ్డే పేర్కొన్నారు. బుట్టబొమ్మ కొత్త ఇంట్లో అడుగుపెట్టినందుకు అభిమానులు ఆమెకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

ఇక సినిమాల విషయానికొస్తే.. గతేడాది 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్' సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకుంది పూజాహెగ్డే. అలానే అమ్మడు నటించిన 'ఆచార్య' 'రాధే శ్యామ్' చిత్రాలు రిలీజ్ కు రెడీగా ఉన్నాయి. ఇక మహేష్ బాబు తో 'SSMB28' - పవన్ కళ్యాణ్ తో 'భవదీయుడు భగత్ సింగ్' సినిమాలు చేస్తోంది. తమిళ్ లో విజయ్ సరసన 'బీస్ట్' అనే సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది. బాలీవుడ్ లో రణవీర్ సింగ్ తో 'సర్కస్' మూవీ.. సల్మాన్ ఖాన్ మరియు అక్షయ్ కుమార్ లతో మరో రెండు సినిమాలు చేస్తూ బిజీగా గడుపుతోంది.