Begin typing your search above and press return to search.

'ఓ ఇషా'.. 'మేజర్' నుంచి మరో బ్యూటిఫుల్ మెలోడీ..!

By:  Tupaki Desk   |   18 May 2022 11:38 AM GMT
ఓ ఇషా.. మేజర్ నుంచి మరో బ్యూటిఫుల్ మెలోడీ..!
X
వర్సటైల్ హీరో అడివి శేష్ నటించిన మోస్ట్ అవైటెడ్ పాన్ ఇండియా మూవీ ''మేజర్''. 26/11 ఎటాక్స్ హీరో మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ బయోపిక్ గా తెరకెక్కిన ఈ సినిమా రిలీజ్ కు రెడీ అయింది. ప్రపంచ వ్యాప్తంగా 2022 జూన్ 3న తెలుగు హిందీ మరియు మలయాళ భాషల్లో ఒకేసారి విడుదల కానుంది. ఈ నేపథ్యంలో శేష్ అండ్ టీం సినిమాని జోరుగా ప్రమోట్ చేస్తున్నారు.

ఇప్పటికే విడుదలైన 'మేజర్' ప్రచార చిత్రాలు మరియు 'హృదయమా' అనే ఫస్ట్ సింగిల్ మంచి రెస్పాన్స్ తెచ్చుకున్నాయి. ఈ క్రమంలో మ్యూజికల్ ప్రమోషన్స్ లో భాగంగా 'ఓ ఇషా' అనే రెండో పాటను సూపర్ స్టార్ మహేష్ బాబు సోషల్ మీడియాలో రిలీజ్ చేశారు. ఇది మేజర్ లో తనకు నచ్చిన మరో పాట అని పేర్కొన్నారు.

''ఓ ఇషా'' అనేది శ్రీచరణ్ పాకాల కంపోజిషన్ లో వచ్చినమెలోడియస్ గీతం. ఇది అడివి శేష్ మరియు హీరోయిన్ సయీ మంజ్రేకర్ మధ్య 90ల నాటి ప్రేమకథను.. వారి మధ్య అద్భుతమైన కెమిస్ట్రీని చూపుతోంది. ఆర్మీ అధికారుల జీవితాన్ని చూపిస్తున్న ఈ పాట విజువల్స్ కంటికి ఇంపుగా అనిపిస్తున్నాయి.

గెట్ టుగెదర్ లో ఆర్మీ అధికారులు తమ జీవిత భాగస్వాములతో కలిసి డ్యాన్స్ చేస్తున్నప్పుడు మేజర్ తన జీవితంలోని ప్రేమ జ్ఞాపకాలను గుర్తుచేసుకోవడంతో ఈ పాట ప్రారంభమవుతుంది. స్కూల్ డేస్ లో శేష్ - సాయీ మధ్య ఇన్నోసెంట్ లవ్ స్టొరీని ఈ పాటలో చూడొచ్చు.

శేష్ ఈ పాటలో పాఠశాల విద్యార్థిగా యవ్వనంగా కనిపించగా.. ఇందులో సాయి మంజ్రేకర్ వయస్సులో వైవిధ్యాన్ని మనం గమనించవచ్చు. రాజీవ్ భరద్వాజ్ ఈ గీతానికి సాహిత్యం అందించగా.. అర్మాన్ మాలిక్ మరియు చిన్మయి శ్రీపాద తమ గాత్రంతో పాటకు ప్రాణం పోశారు.

'మేజర్' చిత్రానికి శశి కిరణ్ తిక్క దర్శకత్వం వహించారు. మహేష్ బాబు GMB ఎంటర్టైన్మెంట్ మరియు A+S మూవీస్ తో కలిసి సోనీ పిక్చర్స్ ఫిల్మ్స్ ఇండియా ఈ సినిమాని నిర్మించింది. వంశీ పచ్చిపులుసు సినిమాటోగ్రఫీని నిర్వహించారు. అబ్బూరి రవి డైలాగ్స్ రాసారు.

26/11 ముంబై దాడులలో దేశం కోసం తన ప్రాణాలను అర్పించిన నిస్వార్థ, ధైర్య సైనికుడు మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ కు ''మేజర్'' సినిమా పరిపూర్ణ నివాళి అని భావించవచ్చు. శేష్ ప్రధాన పాత్ర పోషించడమే కాకుండా కథ - స్క్రీన్‌ ప్లే కూడా సమకూర్చారు. ఇందులో శోభితా ధూళిపాళ - ప్రకాష్ రాజ్ - రేవతి మరియు మురళీ శర్మ ఇతర పాత్రలు పోషించారు.