Begin typing your search above and press return to search.
'అతిధి దేవోభవ' నుంచి అందమైన ప్రేమ గీతం..!
By: Tupaki Desk | 16 Dec 2021 8:00 AM ISTయంగ్ హీరో ఆది సాయి కుమార్ హిట్ ప్లాప్ లను పట్టించుకోకుండా వరుసగా సినిమాలు చేసుకుంటూ వెళ్తున్నారు. ఆది లైనప్ లో ఉన్న లవ్ అండ్ యాక్షన్ థ్రిల్లర్ ''అతిధి దేవోభవ''. నాగేశ్వర్ పొలిమేర ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు.
ఇందులో నువేక్ష హీరోయిన్ గా నటించింది. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్ సినిమాపై ఆసక్తిని కలిగించింది. అలానే సిద్ శ్రీరామ్ ఆలపించిన 'బాగుంటుంది నువ్వు నవ్వితే' అనే పాట శ్రోతలను విశేషంగా ఆకట్టుకుంది.
ఈ క్రమంలో తాజాగా 'అతిధి దేవోభవ' చిత్రం నుంచి 'గాజుబొమ్మ తీరున' అనే మరో సాంగ్ లిరికల్ వీడియోని చిత్ర బృందం రిలీజ్ చేసింది. శేఖర్ చంద్ర ఈ గీతానికి ఫ్రెష్ మెలోడీ ట్యూన్ ని సమకూర్చారు.
'గాజు బొమ్మ తీరున.. చూసే గుండె నీదిరా.. గాయమైతే చూడలేవు. గారమంటే నీదిరా' అంటూ సాగిన ఈ పాట ప్రేక్షకులను అలరిస్తోంది. ప్రేమలో మునిగి తేలుతున్న యువతీ యువకులు తమ భావాలను తెలియజెప్పేలా లిరిసిస్ట్ కృష్ణ కాంత్ ఈ ప్రేమ గీతానికి సాహిత్యం అందించారు.
హృతిక ఆనంది - రితేష్ రావు కలిసి ఈ పాటను వినసొంపుగా ఆలపించారు. ఈ పాటలో ఆది సాయికుమార్ - నువేక్ష మధ్య కెమిస్ట్రీ బాగుంది. ఈ చిత్రానికి అమరనాధ్ బొమ్మిరెడ్డి దీనికి సినిమాటోగ్రఫీ అందించగా.. కార్తీక్ శ్రీనివాస్ ఎడిటింగ్ వర్క్ చేశారు. 'అతిధి దేవోభవ' చిత్రానికి వేణు గోపాల్ రెడ్డి కథ అందించగా.. రజనీ రాజబాబు స్క్రీన్ ప్లే - మాటలు రాశారు.
రామ సత్యనారాయణ రెడ్డి సమర్పణలో శ్రీనివాస సినీ క్రియేషన్స్ బ్యానర్ పై రాజబాబు మిర్యాల - అశోక్ రెడ్డి మిర్యాల సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
ఇందులో రోహిణి - సప్తగిరి - సూర్య - ఆదర్శ్ - రవి ప్రకాష్ - రఘు కారుమంచు - మణిచందన - భెల్ ప్రసాద్ - గుండు సుదర్శన్ - ప్రియాంక - నవీనా రెడ్డి - సత్తిపండు - ఇమ్మాన్యుయేల్ తదితరులు ఇతర పాత్రలు పోషించారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న 'అతిధి దేవోభవ' చిత్రాన్ని త్వరలోనే ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.