Begin typing your search above and press return to search.

బాలయ్యను నాన్న అనబోతున్న బ్యూటీఫుల్ హీరోయిన్

By:  Tupaki Desk   |   23 May 2022 10:30 AM GMT
బాలయ్యను నాన్న అనబోతున్న బ్యూటీఫుల్ హీరోయిన్
X
నందమూరి బాలకృష్ణ అనిల్ రావిపూడి కలయికలో ఒక సినిమా రాబోతున్నట్లు గత కొంత కాలంగా వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. ఇక మొత్తానికి వీరి కలయిక త్వరలోనే సెట్స్ పైకి రాబోతున్నట్లు ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో దర్శకుడు అనిల్ రావిపూడి ఒక క్లారిటీ ఇచ్చాడు. ప్రస్తుతం F3 సినిమా విడుదల ప్రమోషన్స్ లో బిజీగా ఉన్నా ఈ దర్శకుడు బాలయ్య బాబుకు సంబంధించిన ప్రాజెక్టు పై కూడా అఫీషియల్ గా మరొక క్లారిటీ ఇచ్చాడు.

ఈ సినిమా క్యారెక్టర్ బేస్ మీద వెళుతూ ఉంటుంది అని గతంలో ఎప్పుడూ లేని విధంగా బాలయ్యబాబు చూపించబోతున్నట్లు వివరణ ఇచ్చారు. తప్పకుండా మాస్ యాక్షన్ ఎలిమెంట్స్ తో పాటు తన నుంచి ప్రేక్షకులు కోరుకునే ఒక మంచి కామెడీ ఎంటర్టైన్మెంట్ కూడా ఆ సినిమాలో ఉంటుంది అని వివరణ ఇచ్చారు. అయితే ఈ సినిమాలో ఒక బ్యూటీఫుల్ హీరోయిన్ కూడా ముఖ్యమైన పాత్రలో కనిపించబోతున్నాడు అని కథనాలు వెలువడ్డాయి.

పెళ్లి సందడి సినిమాతో మంచి గుర్తింపును అందుకున్న శ్రీలీల ఆ ప్రస్తుతం రవితేజ అలాగే మిగతా హీరోలతో కూడా చాలా మంచి సినిమాలు చేస్తోంది అయితే ఈ బ్యూటీ బాలయ్య బాబు కు జోడిగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కబోయే సినిమాలో నటిస్తున్నట్లుగా కొన్ని కథనాలు వెలువడ్డాయి కానీ నిజానికి ఆమె కూతురి పాత్రలో నటించడం లేదు.

నందమూరి బాలకృష్ణ ఆ సినిమాలో 45 వేల నుంచి 50 ఏళ్ల మధ్య లో ఉన్నది ఒక పవర్ఫుల్ వ్యక్తిగా కనిపిస్తాడు అని అయితే అతనికి కూతురి పాత్రలో స్త్రీల కనిపించబోతున్నట్లు దర్శకుడు అనిల్ రావిపూడి క్లారిటీ ఇచ్చాడు


ఈ సినిమాలో మంచి ఎమోషన్ తో పాటు బాలయ్య బాబు నుంచి ఫ్యాన్స్ కోరుకునే అన్ని రకాల ఎలిమెంట్స్ ఉంటాయని అన్నారు. ఇక బాలయ్య బాబు గోపిచంద్ మలినేని దర్శకత్వంలో కూడా ఒక సినిమా చేస్తున్న విషయం తెలిసిందే.

ఆ సినిమాకు అన్నగారు అనే టైటిల్ అనుకుంటున్నట్లు సమాచారం. ఇక ఇప్పటికే సగానికి పైగా షూట్ పూర్తి చేసిన చిత్ర యూనిట్ సభ్యులు వీలైనంత త్వరగా ఫస్ట్ లుక్ టీజర్ ను విడుదల చేయాలనీ అనుకుంటున్నారు.