Begin typing your search above and press return to search.

బిబి4 : అంతలా చూపిస్తే చూడకుండా ఎలా ఉంటాం

By:  Tupaki Desk   |   17 Sep 2020 5:32 PM GMT
బిబి4 : అంతలా చూపిస్తే చూడకుండా ఎలా ఉంటాం
X
బిగ్‌ బాస్‌ లో ఈసారి అందాల వర్షం కురియడం ఖాయం.. అందులో ప్రేక్షకులు తడిసి ముద్ద అవ్వడం ఖాయం అన్నట్లుగా ప్రారంభంకు ముందు నెల రెండు నెలల నుండే ప్రచారం జరుగుతూ వచ్చింది. ప్రేక్షకులు కోరుకున్నట్లుగానే ముద్దుగుమ్మలను ఈసారి బిగ్‌ బాస్‌ టీం ఎంపిక చేశారు. అయితే వారు అనుకున్నదాని కంటే ఎక్కువగానే ముద్దుగుమ్మల అందాల ఆరబోతకు ప్రేక్షకులు ఫిదా అవుతున్నారు. హీరోయిన్‌ మోనాల్‌ గజ్జర్‌.. దివి మరియు అరియానాలు అందాల ప్రదర్శన చేయాలంటూ షో నిర్వాహకులు ముందుగానే ఒప్పందం చేసుకుని ఉంటారు. నేను బోల్డ్‌ అంటూ వచ్చిన అరియానా రచ్చ చేస్తుంది అనుకుంటే ఆమెకు బదులుగా దేత్తడి హారిక దుమ్ము రేపుతోంది.

హీరోయిన్‌ మోనాల్‌ గజ్జర్‌ కు హాట్‌ దివికి ఏమాత్రం తగ్గకుండా హారిక ప్రేక్షకులతో దేత్తడి పోచమ్మ గుడి అనిపిస్తోంది. షో లో ఎంట్రీ ఇచ్చే రోజే థైస్‌ ఎక్స్‌ పోజ్‌ చేస్తూ వచ్చిన హారిక అప్పటి నుండి ఏమాత్రం తగ్గడం లేదు. అలాంటి డ్రస్‌ లు ఆమెకు ఫ్రీగా ఉంటాయేమో వాటినే వేసుకుంటుంది. దాంతో ప్రేక్షకులు వావ్‌ అంటున్నారు. ఇక మోనాల్‌ గజ్జర్‌ మరియు దివిలు సమయం వచ్చినప్పుడు వారు ఏమాత్రం వెనక్కు తగ్గకుండా అందాల ప్రదర్శణ చేస్తున్నారు. ఇక ఇప్పటి వరకు బోల్డ్‌ అంటూ వచ్చిన క్యూట్‌ పాప మాత్రం తన బోల్డ్‌ అందాలను చూపించలేదు. అందుకు కాస్త సమయం ఉందేమో అంటూ ప్రేక్షకులు ఎదురు చూస్తున్నారు.

మొత్తానికి అరియానా కాకుండా మిగిలిన ముగ్గురు అంతగా చూపిస్తూ ఉంటే షో ను చూడకుండా ఎలా ఉంటాం అంటూ నెటిజన్స్‌ సోషల్‌ మీడియాలో బిగ్‌ బాస్‌ హ్యాష్‌ ట్యాగ్‌ తో కామెంట్స్‌ చేస్తున్నారు. అరియానా బోల్డ్‌ షో కోసం వెయిట్‌ చేస్తున్నాం అంటూ నెటిజన్స్‌ మీమ్స్‌ షేర్‌ చేస్తున్నారు. ఒక వైపు లవ్‌ ట్రాక్‌ మరో వైపు అందాల ప్రదర్శణ ఈసారి యూత్‌ ఆడియన్స్‌ కు బిగ్‌ బాస్‌ కన్నుల వింధు చేస్తుంది. కాని ఫ్యామిలీ ఆడియన్స్‌ కు దూరం అయ్యిందేమో అనిపిస్తుంది.