Begin typing your search above and press return to search.

క‌వ్విస్తున్న క‌పూర్ గాళ్ ఒంపుసొంపులు

By:  Tupaki Desk   |   11 Dec 2022 5:30 AM GMT
క‌వ్విస్తున్న క‌పూర్ గాళ్ ఒంపుసొంపులు
X
క‌పూర్ ఫ్యామిలీ ఫ్యాష‌నిస్టాలుగా సోన‌మ్ క‌పూర్- జాన్వీ క‌పూర్ ఓ వెలుగు వెలుగుతున్న‌ సంగ‌తి తెలిసిందే. త్వ‌ర‌లో ఖుషీ క‌పూర్ కూడా పోటీబ‌రిలోకి దిగుతోంది. అక్క జాన్వీ లానే ఖుషీ కూడా క‌థానాయిక‌గా ఆరంగేట్రం చేయ‌నుంది. ఇక‌ ఇదే క‌పూర్ ఫ్యామిలీ నుంచి మ‌రో బ్యూటీ కూడా ఇటీవ‌ల వార్త‌ల్లో వ్య‌క్తిగా మారింది.

మోనికా ఓ మై డార్లింగ్ చిత్రంతో న‌ట‌నారంగేట్రం చేసిన స‌ద‌రు బ్యూటీ పేరు ఆకాంక్ష రాంజ‌న్ క‌పూర్. ఆర్.ఆర్.ఆర్ సీత ఆలియాభ‌ట్ కి క్లోజ్ ఫ్రెండ్. ఇటీవ‌లే నెట్ ఫ్లిక్స్ లో విడుద‌లైన‌ 'మోనికా ఓ మై డార్లింగ్' లో అద్భుత న‌ట‌న‌తో ఆక‌ట్టుకున్న ఆకాంక్ష‌పై ఆలియా ప్రశంసలు కురిపించింది. త‌న‌ బెస్ట్ ఫ్రెండ్ ఆకాంక్ష రంజన్ కపూర్ గురించి గర్వపడుతున్నానని అలియా భట్ మీడియా చాటింగుల్లో చెప్పింది.

మోనికా ఓ మై డార్లింగ్ విజ‌యం త‌ర‌వాత‌ ఆకాంక్ష రంజన్ కపూర్ బాలీవుడ్ లో బిగ్ కెరీర్ ని ఆశిస్తోంది. ప్ర‌స్తుతం ఆకాంక్ష‌పై ప‌రిశ్ర‌మ‌లో ఆరాలు మ‌రింత‌గా పెరిగాయి. నిజానికి ఈ బ్యూటీ ఇటీవ‌లే మార్కెట్లో విడుద‌లైన గ్యాలాక్సీ ఫ్లిప్ స్టైల్ స్మార్ట ఫోన్ కి ప్ర‌చార క‌ర్త‌గా కొన‌సాగుతోంది. క‌త్రిన‌తో క‌లిసి అల్ట్రా లైట ఆయిల్ ప్ర‌చారంలోను మెరిసింది. ఆకాంక్ష న‌టిగా ఎదుగుతోంది. అదే స‌మ‌యంలో టాప్ మోడ‌ల్ గా భారీగా ఆర్జిస్తోంది.

'మోనికా ఓ మై డార్లింగ్' న‌వంబర్ 11న నెట్ ఫ్లిక్స్ లో ప్రీమియర్ గా ప్రదర్శిత‌మైంది. ఈ చిత్రంలో రాజ్ కుమార్ రావ్- హుమా ఖురేషీ- రాధికా ఆప్టే -సికిందర్ ఖేర్‌లతో కలిసి ఆకాశ రాంజన్ కపూర్ కనిపించింది.  ఇందులో కంపెనీ అధిపతి కుమార్తె నిక్కీ అధికారి పాత్రలో నటించిన ఆకాన్షా రంజన్ కపూర్ ను ఇటీవ‌ల వ‌రుస అవ‌కాశాలు వ‌రిస్తున్నాయ‌ని తెలిసింది. అందుకు త‌గ్గ‌ట్టే ఇప్పుడు సోష‌ల్ మీడియాల్లో వ‌రుస ఫోటోషూట్ల‌తో ఆకాంక్ష విరుచుకుప‌డుతోంది. యూత్ మైండ్ బ్లాక్ చేసే హాటెస్ట్ ఫోటోలు వీడియోల‌తో విరుచుకుప‌డుతోంది. ఆకాంక్ష షేర్ చేసిన తాజా బోల్డ్ ఫోటోగ్రాఫ్ అంత‌ర్జాలంలో వైర‌ల్ గా మారింది. మోనికా ఓ మై డాళింగ్ కంటే ముందే గిల్టీ అనే చిత్రంతో నటిగా ప‌రిచ‌య‌మైన ఆకాంక్ష‌.. ప్ర‌స్తుతం వ‌రుస చిత్రాల‌తో బిజీ అవుతోంది.

మోనికా ఓ మై డార్లింగ్ పై అభిమానులతో పాటు విమర్శకులు  ప్రశంసలు కురిసాయి. జపనీస్ రచయిత కీగో హిగాషినో మిస్టరీ నవల బురుటాసు నో షింజౌకి అనుకరణగా రూపొందిన ఈ చిత్రానికి వాసన్ బాలా దర్శకత్వం వహించారు. ఓ మై డార్లింగ్-నియో-నోయిర్ క్రైమ్ కామెడీ థ్రిల్లర్. ఇది మర్డర్ మిస్టరీ కోణంలోను అల‌రించింది. మోనికా ఓ మై డార్లింగ్ ఒక‌ రొటీన్ బాలీవుడ్ సినిమా కాదు. 2 గంటల 10 నిమిషాల నిడివితో కుర్చీ అంచుపై కూచోబెట్టే థ్రిల్ల‌ర్. ఈ సినిమా క‌థ క‌థ‌నంలో సంఘటనలు ఊహకు అంద‌ని మ‌లుపుల‌తో ఆద్యంతం ఆక‌ట్టుకుంటాయి.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.