Begin typing your search above and press return to search.

సూపర్‌ స్టార్‌ సినిమా ఆన్‌ లొకేషన్‌ స్టిల్‌ లీక్‌

By:  Tupaki Desk   |   4 Nov 2021 5:52 AM GMT
సూపర్‌ స్టార్‌ సినిమా ఆన్‌ లొకేషన్‌ స్టిల్‌ లీక్‌
X
కోలీవుడ్‌ సూపర్‌ స్టార్‌ విజయ్ ప్రస్తుతం మోస్ట్‌ క్రేజీ అండ్‌ బిగ్గెస్ట్‌ మూవీ 'బీస్ట్‌' విడుదల కోసం తమిళ ప్రేక్షకులు అంతా కూడా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. విజయ్ గత చిత్రం మాస్టర్ సాధించిన బ్లాక్ బస్టర్ విజయం నేపథ్యంలో ఈ సినిమాపై అంచనాలు సహజంగానే భారీగా పెరిగాయి. విజయ్ ఈమద్య కాలంలో ప్రతి సినిమా కూడా సునాయాసంగా వంద కోట్లు అంతకు మించిన వసూళ్లను రాబడుతూనే ఉన్నాయి. ఇప్పుడు ఈ సినిమా ఈజీగా 250 కోట్లకు పైగా వసూళ్లను దక్కించుకుంటుందనే వార్తలు వస్తున్నాయి. తమిళంతో పాటు ఇతర భాషల్లో కూడా ఈ సినిమాను విడుదల చేసేందుకు మేకర్స్ పెద్ద ఎత్తున ప్లాన్‌ చేస్తున్నట్లుగా ఇండస్ట్రీ వర్గాల వారు మరియు తమిళ మీడియా వర్గాల వారి ద్వారా సమాచారం అందుతోంది.

విజయ్ హీరోగా నెల్సన్‌ దిలీప్‌ కుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా చిత్రీకరణ ప్రస్తుతం ఒక షాపింగ్ మాల్ భారీ సెట్‌ లో జరుగుతోంది. గత కొన్ని రోజులుగా అక్కడ కీలక సన్నివేశాలను తెరకెక్కిస్తున్నట్లుగా చెబుతున్నారు. ఈ సినిమాలో పోలీస్‌ ఆఫీసర్ గా విజయ్ కనిపించబోతున్నట్లుగా ప్రచారం జరుగుతోంది. మొత్తానికి సినిమాకు సంబంధించిన ప్రతి చిన్న విషయం కూడా భారీ హైప్‌ తో పబ్లిసిటీ అవుతున్న ఈ సమయంలో ఒక ఫొటో లీక్ అయ్యి సినిమా పై అంచనాలు మరింతగా పెరిగేలా చేసింది. విజయ్ మాల్ లో చిత్రీకరణ లో పాల్గొంటున్న సమయంలో తీసిన ఈ ఫొటో లో విజయ్ వైట్‌ షర్ట్‌ ను ధరించి ఉన్నాడు. చాలా సీరియస్ లుక్ లో విజయ్‌ ను ఈ ఫొటోలో చూడవచ్చు.

విజయ్ బీస్ట్‌ సినిమాలో ఇంతకు ముందు ఎప్పుడు కనిపించనంత మాస్ లుక్ లో కనిపించబోతున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. విజయ్‌ సినిమా యాక్షన్‌ సన్నివేశాలు ది బెస్ట్‌ గా ఉండేలా ప్రతిసారి జాగ్రత్తలు తీసుకుంటూనే ఉంటారు. ఈసారి అంతకు మించి అన్నట్లుగా ఉంటాయని అంటున్నారు. ఇక విజయ్ మొదటి సారి తెలుగు లో నటించేందుకు సిద్దం అవుతున్నాడు. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో దిల్‌ రాజు నిర్మించబోతున్న సినిమాలో విజయ్ హీరోగా తెలుగు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. విజయ్ ఈ సినిమాతో పాన్ ఇండియా రేంజ్ లో ప్రేక్షకులను ఎంటర్‌ టైన్ చేయబోతున్నట్లుగా దిల్ రాజు చెబుతున్నాడు. ఇప్పటి వరకు విజయ్‌ నటించిన చాలా సినిమాలు తెలుగు లో విడుదల అయ్యాయి కాని సక్సెస్ కాలేదు. కాని ఈ సినిమాతో ఆ తెలుగు లో సక్సెస్‌ దక్కించుకోవాలని విజయ్ కోరుకుంటున్నాడు.