Begin typing your search above and press return to search.

జీవితాంతం వారికి రుణపడి ఉంటానన్న స్వాతిముత్యం హీరో

By:  Tupaki Desk   |   3 Oct 2022 5:42 AM GMT
జీవితాంతం వారికి రుణపడి ఉంటానన్న స్వాతిముత్యం హీరో
X
సితార ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై బెల్లంకొండ సాయి గణేష్ మరియు వర్ష బొల్లమ్మ జంటగా సూర్యదేవర నాగవంశీ నిర్మించిన 'స్వాతిముత్యం' చిత్రం అక్టోబర్ 5వ తారీకున ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెల్సిందే. ఈ నేపథ్యంలో చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్ ను ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకకు నవీన్ పొలిశెట్టి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

ఈ సందర్భంగా హీరోయిన్‌ వర్ష బొల్లమ్మ మాట్లాడుతూ.. దర్శకుడు లక్ష్మణ్ చాలా నిజాయితీ గల వ్యక్తి. ఆయన చాలా పెద్ద దర్శకుడు అవుతాడని ఆశిస్తున్నాను. గణేష్ గురించి చెప్పాలి. 'గణేష్ నవ్వు చాలు.. ఫుల్ అవుతుంది సినిమా హాలు'. నిజంగానే గణేష్ స్వాతిముత్యమే.

నవీన్ పొలిశెట్టి మాట్లాడుతూ.. ఈ వేడుకకు ముఖ్య అతిథిగా రావడం చాలా సంతోషంగా ఉంది. ఒకప్పుడు ఇదే శిల్పకళా వేదికలో జరిగిన వేడుకలకు పాస్ లు దొరక్క తిరిగి వెళ్లిపోయిన రోజులున్నాయి. అలాంటి నన్ను ఈరోజు ఈ వేదిక మీద అతిథిగా నిలబెట్టిన తెలుగు ప్రేక్షకులకు హృదయపూర్వక ధన్యవాదాలు. స్వాతిముత్యం సినిమాతో తెలుగు సినీ పరిశ్రమకు పరిచయమవుతున్న బెల్లంకొండ గణేష్ కి స్వాగతం.

నిర్మాత నాగవంశీ మాట్లాడుతూ.. "పిలవగానే ఈ వేడుకకు వచ్చి వినోదాన్ని పంచిన నవీన్ కి ధన్యవాదాలు. అక్టోబర్ 5న స్వాతిముత్యం సినిమా వస్తుంది. ఈ సినిమా అసలు నిరాశపరచదు. థియేటర్ కి వచ్చిన అందరికీ ఖచ్చితంగా వినోదాన్ని పంచుతుంది. మెగాస్టార్ చిరంజీవి గారు ఆయన సినిమా ఫంక్షన్ లో వర్షంలో తడుస్తూ కూడా గుర్తుపెట్టుకొని మా సినిమా గురించి మాట్లాడినందుకు ఆయనకు హృదయపూర్వక ధన్యవాదాలు.

గణేష్ మాట్లాడుతూ.. మమ్మల్ని ఆశీర్వదించడానికి వచ్చిన అందరికీ ధన్యవాదాలు. ఇంత మంచి కథ ఇచ్చిన లక్ష్మణ్ గారికి ధన్యవాదాలు. చినబాబు గారికి, వంశీ గారికి నేను జీవితాంతం రుణపడి ఉంటాను. ఈ సినిమాలో హీరోయిన్ గా వర్ష కాకుండా వేరే ఎవరు ఉన్నా నాకు ఇంత సపోర్ట్ దొరికేది కాదేమో. మెగాస్టార్ చిరంజీవి గారు ఆయన సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో మా సినిమా గురించి మాట్లాడటం చాలా ఆనందంగా అనిపించింది. చిరంజీవి గారికి ధన్యవాదాలు" అన్నారు.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.