Begin typing your search above and press return to search.
NTR 30 హైరేంజ్లో బీచ్ ఫైట్..
By: Tupaki Desk | 7 Feb 2023 6:00 PM GMTహీరో ఎన్టీఆర్.. దర్శకుడు కొరటాల శివ కలయికలో NTR 30 పేరుతో ఓ పాన్ ఇండియా ప్రాజెక్ట్ పట్టాలెక్కనున్న సంగతి తెలిసిందే. జనతా గ్యారేజ్ వంటి హిట్ తర్వాత ఈ ఇద్దరి నుంచి వస్తున్న రెండో చిత్రమిది. మిక్కిలినేని సుధాకర్, హరికృష్ణ.కె సంయుక్తంగా నిర్మిస్తున్నారు. కల్యాణ్‌రామ్ సమర్పిస్తున్నారు. ఈ సినిమా పూర్వ నిర్మాణ పనుల్ని పూర్తి చేసుుకున్న ఈ సినిమా ఈ నెలలో షూటింగ్ ప్రారంభించుకోనుంది. అసలే అప్డేట్స్ అప్డేట్స్ అంటూ చాలా కాలంగా రచ్చ చేస్తున్న అభిమానులకు ఉత్సాహాన్ని వార్త ఒకటి తాజాగా బయటకు వచ్చింది.
బీచ్ సెటప్ వేసి ఓ హెవీ యాక్షన్ సీక్వెన్స్‌ను రూపొందించనున్నారట. చిత్రానికే ఇదే మెయిన్ హైలైట్‌గా నిలవనుందట. కొరటాల దీన్ని ఎలా తెరకెక్కిస్తున్నారంటే... ఇది చూసినప్పుడు ప్రేక్షకులకు పూనకాలు రావడం ఖాయమని అంటున్నారు. సినిమాలో ఈ బీచ్ యాక్షన్ సీక్వెన్స్ చిత్రానికి కీలకం కానుందట. కథలో ఇక్కడి సన్నివేశాలే ముఖ్యమట. ఇందుకోసం భారీ సెటప్ వేయబోతున్నారని తెలుస్తోంది. ఇకపోతే ఎన్టీఆర్ అభిమానుల్ని, ప్రేక్షకుల్ని మెప్పించేలా ఓ శక్తిమంతమైన కథతో ఈ చిత్రం రూపొందనుంది. అనిరుధ్ సంగీతం సమకూరుస్తున్నారు.
కాగా, నిజానికి కొరటాల శివ, ఎన్టీఆర్ ఈ సినిమా ప్రకటించాక సైలెంట్‌గా ఉండిపాయారు. ఇక దీని గురించి ఎలాంటి అప్డేట లేకపోవడంతో ఈ మూవీ సెట్స్‌పై వెళ్లుందా? లేదా? అనే అనుమానాలు వెల్లుత్తాయి. అప్పటి నుంచి ఫ్యాన్స్ అప్డేట్స్ అంటూ సోషల్‌మీడియా వేదికగా రచ్చ రచ్చ చేశారు. దీంతో ఇటీవలే కల్యాణ్ రామ్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు గెస్ట్ గా వెళ్లిన ఎన్టీఆర్ ఫుల్ సీరియస్ అయిపోయారు. ఒకానొక సందర్భంలో యాంకర్ సుమను కూడా చాలా కోపంగా చూస్తూ కనిపించారు. అభిమానులకైతే ఫుల్ క్లాస్ పీకారు. ఆ సమయంలో అక్కడే ఉన్న కళ్యాణ్ రామ్.. ఎన్టీఆర్‌ను సముదాయించేందుకు ప్రయత్నించగా.. ఎన్టీఆర్ కాస్త స్థిమిత పడ్డారు.
ఎన్టీఆర్ 30 అప్డేట్ అనే కాదు ఏ హీరో సినిమా అప్డేట్ అయినా సరే ఎలాంటి ఇబ్బంది లేకుండా మేమే బయట పెడతాం. అలా అన్ని సార్లు అడిగితే దర్శక నిర్మాతల మీద ఒత్తిడి పడుతుంది. దయచేసి ఈ విషయంలో అర్థం చేసుకోండి. అప్డేట్ విషయాల్లో మాకు మా కుటుంబ సభ్యుల కన్నా అభిమానులే ఎక్కువ. మా భార్యల కన్నా ముందే మీకే చెబుతాం అంటూ ఎన్టీఆర్ ఫ్యాన్స్‌ను ఉద్దేశిస్తూ మాట్లాడారు. సినిమా అనుకున్న తేదీకే వచ్చే ఏడాది ఏప్రిల్ 5న రిలీజ్ అవుతుందని స్పష్టతనిచ్చారు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.