Begin typing your search above and press return to search.

ఈరోజు ఇద్ద‌రు AA- స్టార్స్ కి B-DAY శుభాకాంక్ష‌లు

By:  Tupaki Desk   |   8 April 2022 3:28 AM GMT
ఈరోజు ఇద్ద‌రు AA- స్టార్స్ కి B-DAY శుభాకాంక్ష‌లు
X
ఈరోజు టాలీవుడ్ లో ఇద్ద‌రు AA- స్టార్స్ బ‌ర్త్ డేలు జ‌రుపుకోవ‌డంపై అభిమానుల్లో ఎగ్జ‌యిట్ మెంట్ నెల‌కొంది. 08 ఏప్రిల్ .. అల్లు అర్జున్ - అక్కినేని అఖిల్ ఇద్ద‌రూ పుట్టిన‌రోజు వేడుక‌లతో ఛీర‌ప్ అవుతున్నారు. ఇరువురు హీరోల అభిమానులు శుభాకాంక్ష‌ల్ని ఒక‌రితో ఒక‌రు ఎక్స్ ఛేంజ్ చేసుకుంటున్నారు. ఒక‌రి ఫేవ‌రెట్ కి ఇంకొక‌రు శుభాకాంక్ష‌లు తెలుపుతూ యూనిక్ నెస్ ని ప్ర‌ద‌ర్శిస్తున్నారు.

2022-23 ఈ ఇద్ద‌రికీ బాగా క‌లిసొచ్చే సీజ‌న్ అవుతుంద‌ని అంతా ఆకాంక్షిస్తున్నారు. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ వ‌రుస బ్లాక్ బ‌స్ట‌ర్ల‌తో ఊపు మీదున్నాడు.

పుష్ప చిత్రంతో పాన్ ఇండియా స్టార్ అయ్యాడు. ఇదే హుషారులో అత‌డు సీక్వెల్ క‌థ‌తో పుష్ప - ది రూల్ కోసం ప్రిప‌రేష‌న్ లో ఉన్నాడు. ఈ సినిమాతో హిందీ మార్కెట్లో వంద‌శాతం ప‌ట్టు సంపాదించాల‌న్న‌ది అత‌డి ప్ర‌ణాళిక‌.

ఇక అక్కినేని అఖిల్ స‌న్నివేశం పూర్తి భిన్నంగా ఉంది. అత‌డు ఇటీవ‌లే హ‌లో చిత్రంతో యావ‌రేజ్ అనిపించుకుని మ‌రోసారి మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిల‌ర్ చిత్రంతో హిట్టందుకున్నాడు. న‌టుడిగా అత‌డు అంత‌కంత‌కు ప‌రిణతిని ప్ర‌ద‌ర్శిస్తున్న తీరు యువ‌త‌రంలో చ‌ర్చ‌కు వ‌స్తోంది. అయితే అత‌డికి కెరీర్ ప‌రంగా ఇప్పుడు బంప‌ర్ హిట్ కావాలి.

స‌రిగ్గా ఇలాంటి స‌న్నివేశంలో ధృవ‌- సైరా చిత్రాల్ని అద్భుతంగా తెర‌కెక్కించిన స్టైలిష్ క‌మ‌ర్షియ‌ల్ డైరెక్ట‌ర్ సురేంద‌ర్ రెడ్డితో అఖిల్ సినిమా చేస్తుండ‌డం హాట్ టాపిక్ గా మారింది. అది కూడా గూఢ‌చారి కాన్సెప్టుతో `ఏజెంట్` గా వ‌స్తున్నాడు. ఈ మూవీ కోసం అఖిల్ స‌రికొత్త మేకోవ‌ర్ తో హీటెక్కిస్తున్నాడు.

ఏజెంట్ నిజానికి పాన్ ఇండియా క‌థాంశం అన్న చ‌ర్చా సాగుతోంది. ఇది అంచ‌నాల్ని అమాంతం పెంచేస్తోంది. సురేంద‌ర్ రెడ్డి త‌న‌దై మార్క్ ట్రీట్ మెంట్ తో అఖిల్ కి బ్లాక్ బ‌స్ట‌ర్ ఇస్తాడ‌ని అభిమానులు ఆస‌క్తిగా వేచి చూస్తున్నారు. నేడు బ‌ర్త్ డే లు జ‌రుపుకుంటున్న ఐక‌న్ స్టార్ అల్లు అర్జున్.. అక్కినేని హీరో అఖిల్ ఇద్ద‌రికీ `తుపాకి` త‌ర‌పున శుభాకాంక్ష‌లు.