Begin typing your search above and press return to search.

బీబీసీ వాళ్లూ కబాలిని గుర్తించారు

By:  Tupaki Desk   |   21 July 2016 7:13 AM GMT
బీబీసీ వాళ్లూ కబాలిని గుర్తించారు
X
కొన్నేళ్ల కిందట ‘రోబో’ సౌత్ ఇండియన్ సినిమా స్థాయి ఏంటో ప్రపంచానికి చాటి చెప్పింది. ఇక గత ఏడాది ‘బాహుబలి’ రేపిన ప్రకంపనల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అంతర్జాతీయ మీడియా ‘బాహుబలి’ గురించి చర్చించింది. కొన్ని ప్రముఖ పత్రికల్లో ‘బాహుబలి’ కథనాలు ప్రచురితమయ్యాయి. ఆ సినిమా గురించి ఇప్పటికీ ప్రపంచవ్యాప్తంగా చర్చ నడుస్తోంది. ఇప్పుడు ‘కబాలి’ మరోసారి సౌత్ సినిమాను ప్రపంచ స్థాయిలో నిలబెడుతోంది. సూపర్ స్టార్ రజినీకాంత్ మేనియా గురించి అంతర్జాతీయ మీడియా సైతం ప్రత్యేకంగా కవరేజీ ఇవ్వక తప్పని పరిస్థితి కనిపిస్తోంది. బీబీసీ లాంటి ప్రముఖ మీడియా సంస్థ రజినీ గురించి.. కబాలి గురించి ప్రత్యేకంగా కథనం వెలువరించడం విశేషం.

సూపర్ స్టార్ రజినీకాంత్ అంటే ఇండియాలో ప్రేక్షకులు ఎలా ఊగిపోతున్నారో ‘కబాలి’ సినిమా చుట్టూ నెలకొన్న హైప్ ఎలాంటిదో.. ఉదాహరణలతో వివరిస్తూ కథనం ఇచ్చింది బీబీసీ. ‘కబాలి: ఇండియా ఆఫీస్ హాలిడీ ఫర్ వాచింగ్ రజినీకాంత్ ఫిల్మ్’ పేరుతో ఇచ్చిన ఈ కథనంలో.. ‘కబాలి’తో ఎయిర్ ఏషియా డీల్.. విమానాలపై కబాలి ప్రమోషన్.. కార్పొరేట్ కంపెనీలు ‘కబాలి’ విడుదల రోజు సెలవులివ్వడం.. తమ ఉద్యోగులకు టికెట్లు పంచడం.. రజినీ పేరు మీద ప్రత్యేకంగా నాణేలు విడుదల చేయడం.. విదేశీ భాషల్లోనూ ‘కబాలి’ని విడుదల చేస్తుండటం.. స్టార్ హోటళ్లలో స్క్రీనింగ్.. లాంటి అనేక అంశాల్ని ప్రస్తావించారు. ఆసియాలో అత్యధిక పారితోషకం తీసుకునే హీరో అని.. ఇండియాలో మోస్ట్ బ్యాంకబుల్ హీరో అని రజినీకి కితాబిచ్చింది బీబీసీ. సూపర్ స్టార్ ప్రభ ఏ స్థాయిలో సాగుతోందో చెప్పడానికిది రుజువు.