Begin typing your search above and press return to search.

#BB4 : మొదటి రోజే గేమ్‌ షురూ

By:  Tupaki Desk   |   7 Sept 2020 2:40 PM IST
#BB4 : మొదటి రోజే గేమ్‌ షురూ
X
తెలుగు బిగ్‌ బాస్‌ సీజన్‌ 4 నిన్న గ్రాండ్‌ గా ప్రారంభం అయ్యింది. కొత్త సెట్‌ తో పాటు కొత్త ఫార్మట్‌ లో బిగ్‌ బాస్‌ 4 ప్రారంభం అయ్యింది. నాగార్జున హోస్టింగ్‌ తో మరింత రెచ్చి పోయాడు. ఈ సీజన్‌ లో మొత్తం 16 మంది కంటెస్టెంట్స్‌ ఉన్నారు. వారిలో ఎక్కువ శాతం మందిని చూసి ప్రేక్షకులు పెదవి విరుస్తున్నారు. ఈ పెదవి విరుపులు ప్రతి సీజన్‌ లో కనిపించేవే. అయితే ఈసారి ఇద్దరు మగ్గరు తప్ప తెలిసిన మొహాలు లేవు అంటూ ప్రేక్షకులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. కంటెస్టెంట్‌ విషయంను ప్రేక్షకులు ఎక్కువగా ఆలోచించకుండా మొదటి రోజు నుండే డ్రామాను స్టార్ట్‌ చేసి తర్వాత ఏం జరుగబోతుంది అంటూ అందరిలో ఆసక్తిని కలిగించేలా షో నిర్వాహకులు ప్లాన్‌ చేసినట్లుగా అనిపిస్తుంది.

షో లో చివరి కంటెస్టెంట్‌ గా గంగవ్వను తీసుకు రావడంతో పై 15 మంది గురించి మాట్లాడుకోవడం మానేశారు. ఇక షో మొదటి రోజే ఇద్దరు కంటెస్టెంట్స్‌ ను సీక్రెట్‌ రూంకు పంపించారు. అలాగే ఇంట్లో ఉన్న 14 మందిని 7 జంటలుగా విడగొట్టడం జరిగింది. జంటలు జంటలుగా ఎందుకు క్రియేట్‌ చేశారు. అనేది తెలియాల్సి ఉంది. ఈ మొత్తం సస్పెన్స్‌ తో నేటి ఎపిసోడ్‌ కోసం ప్రేక్షకులు చాలా ఇంట్రెస్టింగ్‌ గా ఎదురు చూస్తున్నారు. గంగవ్వను ఇప్పటి నుండే అభిమానించడం ప్రారంభించిన జనాలు ఆమె మొదటి రోజు ఎలా గడిపింది అనే విషయాన్ని తెలుసుకునేందుకు చాలా ఆసక్తిగా ఉన్నారు.

షో ను రక్తి కట్టించేందుకు మొదటి రోజు నుండే సిక్రెట్‌ టాస్క్‌ లు ఇవ్వడం జరిగింది. ప్రేక్షకులకు కంటెస్టెంట్స్‌ గురించి ఎక్కువగా ఆలోచించుకునే అవకాశం ఇవ్వకుండా షో నిర్వాహకులు మొదటి రోజు నుండే గేమ్‌ ప్లాన్‌ ను షురూ చేసినట్లుగా చెప్పుకోవచ్చు. ముందు ముందు ఈ షో ఎంత ఆసక్తిగా మారబోతుంది. అంచనాలు తలకిందులు అయ్యేలా ఎలాంటి ట్విస్ట్‌ లు షో లో ఉంటాయో చూడాలి.