Begin typing your search above and press return to search.
ఎఫ్3 లో బిబి4 ఎంటర్ టైనర్?
By: Tupaki Desk | 30 Dec 2020 12:00 PM ISTఈసారి బిగ్ బాస్ చాలా ప్రత్యేకంగా నిలిచింది అనడంలో సందేహం లేదు. ఎందుకంటే ఈసారి కంటెస్టెంట్స్ ఎక్కువగా సినిమాల్లో ఆఫర్లు దక్కించుకుంటున్నారు. గత మూడు సీజన్ లలో కనిపించిన వారు విజేతలుగా నిలిచిన వారు ఎవరు కూడా ఇండస్ట్రీలో గుర్తింపు కాదు కదా కనీసం అవకాశాలు కూడా రాబట్టుకోలేక పోయారు. కాని బిబి4 కంటెస్టెంట్స్ మాత్రం చాలా మందికి మంచి గుర్తింపు రావడంతో పాటు సినిమాల్లో షో ల్లో వెబ్ సిరీస్ ల్లో రకరకాలుగా ఆఫర్లు వస్తున్నాయి. ఇప్పటికే సోహెల్ సినిమా చేస్తున్నాడు అభిజిత్ ముందు కథలు పట్టుకుని ఫిల్మ్ మేకర్స్ ఉన్నారు. మెహబూబ్ కు మరియు దివికి మెగా ఆఫర్లు దక్కాయి. మోనాల్ కు సినీ మరియు బుల్లి తెర ఆఫర్లు వచ్చాయి.. ఇంకా కొందరికి బిగ్ బాస్ కలిసి వచ్చింది.
బిబి4 సీజన్ కు ఎంటర్ టైనర్ ఆఫ్ ది హౌస్ గా నిలిచిన అవినాష్ కు కూడా సినిమా ఆఫర్ వచ్చిందట. స్వయంగా అనీల్ రావిపూడి ఫినాలే ఎపిసోడ్ రోజున అవినాష్ తో నీ కామెడీ టైమింగ్ బాగుంటుంది.. నీ కామెడీ నాకు నచ్చుతుంది ఒకసారి తప్పకుండా ఆఫీస్ కు వచ్చి కలువు అన్నాడట. ఆ విషయాన్ని అవినాష్ చాలా సంతోషంగా చెప్పుకొచ్చాడు. ఎఫ్ 3 లో అవినాష్ కు తగ్గట్లుగా ఏమైనా పాత్రను అనీల్ రావిపూడి ఇవ్వబోతున్నాడేమో అంటున్నారు. ఒక వేళ అవినాష్ కనుక ఎఫ్ 3 లో నటిస్తే ఆయన కెరీర్ టర్న్ అయినట్లే అంటూ ఇండస్ట్రీ వర్గాల వారు అంటున్నారు. ఇప్పటికే అవినాష్ క్రేజ్ అమాంతం పెరిగింది. ఈ దెబ్బతో అవినాష్ సినిమాల్లో కమెడియన్ గా సెటిల్ అవ్వడం ఖాయం అంటున్నారు.