Begin typing your search above and press return to search.

బిబి4 : రీ యూనియన్‌ లోనూ హాగ్స్‌ కంటిన్యూ

By:  Tupaki Desk   |   18 Dec 2020 3:45 PM GMT
బిబి4 : రీ యూనియన్‌ లోనూ హాగ్స్‌ కంటిన్యూ
X
తెలుగు బిగ్‌ బాస్‌ మరో రెండు రోజుల్లో ముగియబోతుంది. ఈ ఆదివారం ఫైనల్‌ ఎపిసోడ్‌ టెలికాస్ట్‌ అవ్వబోతుంది. ప్రతి సీజన్‌ లో మాదిరిగానే ఈ సీజన్‌ లో కూడా రీ యూనియన్‌ ను ఏర్పాటు చేశారు. కాని కరోనా కారణంగా గ్లాస్‌ వాల్‌ ను ఏర్పాటు చేసి మరీ ఇది నిర్వహించారు. అద్దాల గ్లాస్‌ నుండి కుటుంబ సభ్యులను ఎలా అయితే బిగ్‌ బాస్‌ చూపించాడో అలాగే ఈ సీజన్‌ లో ఎలిమినేట్‌ అయిన కంటెస్టెంట్స్‌ ను టాప్‌ 5 కి చూపించారు. ఎలాగూ మరో రెండు రోజుల్లో ఫినాలే ఉంటుంది కదా.. ఈ గ్లాస్‌ వాల్‌ ఎందుకు ఇంకా అంటూ కొందరు కామెంట్స్‌ చేస్తున్నారు.

ఇక ప్రోమోలో చూపించిన దాని ప్రకారం మోనాల్‌ ఒంటరిగా వచ్చింది. ఆమె గ్లాస్‌ వాల్‌ నుండే అఖిల్‌ కు హగ్గులు ముద్దులు ఇచ్చింది. దాంతో పాటు అఖిల్‌ నెం.1 అంటూ గట్టిగా అరిచేసింది. వీరిద్దరి కెమిస్ట్రీ ఇంకా కొనసాగుతూనే ఉందిగా అంటున్నారు. కేవలం మోనాల్‌ మాత్రమే కాకుండా ఇతర కంటెస్టెంట్స్‌ అంతా కూడా వచ్చారు. బిగ్‌ బాస్‌ సీజన్‌ 4 మొత్తం చాలా స్పెషల్ గా సాగింది. రీ యూనియన్‌ కూడా అంతే స్పెషల్‌ గా నిర్వహించారు. ఈ రీయూనియన్‌ ను నేడు మరియు రేపు కూడా టెలికాస్ట్‌ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.