Begin typing your search above and press return to search.

బిబి4 : రేటింగ్‌ కోసం ఈ టైంలో కూడా గొడవలు

By:  Tupaki Desk   |   10 Dec 2020 11:02 AM IST
బిబి4 : రేటింగ్‌ కోసం ఈ టైంలో కూడా గొడవలు
X
బిగ్‌ బాస్ లో చివరి రెండు మూడు వారాలు గొడవలు లేకుండా ప్రశాంతంగా ఉంటాయి. గత సీజన్‌ లను ఇతర భాషల బిగ్‌ బాస్ లను చూస్తే అదే అర్థం అవుతుంది. కాని తెలుగు బిగ్‌ బాస్‌ సీజన్‌ 4 విషయంలో మాత్రం విభిన్నంగా జరుగుతుంది. 14వ వారంలో కూడా బిగ్‌ బాస్‌ టీం రేటింగ్‌ కోసం గొడవలు పెడుతున్నారు. ఈ వారం మొత్తం కూడా ఇంటి సభ్యులకు గొడవలు పెట్టేందుకు ప్రయత్నిస్తూనే ఉన్నారు. సాదారణంగా అయితే ఈ వారం అందరు కంటెస్టెంట్స్‌ కు సమానంగా అవకాశం కల్పించి ఎంటర్‌ టైన్‌ మెంట్ చేయించి ఓట్లు అడిగేందుకు ఛాన్స్‌ ఇవ్వాలి.

ఓట్లు అడగాలి అంటే టాస్క్‌ గెలవాలి అంటూ బిగ్‌ బాస్‌ ఇచ్చిన టాస్క్‌ రచ్చ రచ్చ అయ్యింది. ముఖ్యంగా అరియానా.. మోనాల్‌ మరియు సోహెల్‌.. అరియానాల మద్య జరిగిన గొడవ మామూలుగా లేదు. ఈ గొడవల వల్ల రేటింగ్‌ అయితే వచ్చి ఉంటుంది. కాని ఇది ఎంత వరకు కరెక్ట్‌ అంటూ బిగ్‌ బాస్‌ ప్రేక్షకులు ప్రశ్నిస్తున్నారు. మిగిలి ఉన్న ఈ పది రోజులు అయినా కంటెస్టెంట్స్‌ ఫ్రెండ్లీగా ఉండాలంటూ బిగ్‌ బాస్‌ సూచించకుండా వారు గొడవ పడేందుకు ప్రోత్సహించినట్లుగా ఉందంటున్నారు. రేటింగ్‌ కోసం ఈసారి చాలా ప్రయత్నాలు చేశారు. ఈ చివరి ప్రయత్నంపై మాత్రం విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. వచ్చే వారంతో బిగ్‌ బాస్‌ సీజన్‌ 4 ముగుస్తున్న విషయం తెల్సిందే.