Begin typing your search above and press return to search.
బిబి3ః ప్రచారంలోకి ఈసారి మంచు హీరో పేరు
By: Tupaki Desk | 4 April 2021 1:00 PM ISTనందమూరి బాలకృష్ణ హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో రూపొందుతున్న మూవీ షూటింగ్ ముగింపు దశకు వచ్చింది. ఈ సినిమాలో ఒక యంగ్ హీరో కనిపించబోతున్నాడు అంటూ చాలా కాలం నుండి వార్తలు వస్తున్నాయి. కాని ఇప్పటి వరకు ఆ వార్తలకు సంబంధించిన క్లారిటీ మాత్రం రాలేదు. ఆ పాత్రకు ఈ యంగ్ హీరో లేదు ఆ యంగ్ హీరో అంటూ ఎంతో మంది పేర్లు ప్రచారం జరిగాయి. తాజాగా మరో హీరో పేరు ప్రచారం జరుగుతోంది. బాలయ్య మరియు బోయపాటి సినిమాలో ఆ పాత్రను మంచు హీరో మనోజ్ చేయబోతున్నట్లుగా చెబుతున్నారు. పెద్ద ఎత్తున అంచనాలున్న ఈ సినిమా లో మంచు మనోజ్ గెస్ట్ అప్పియరెన్స్ తప్పకుండా సినిమాకు అదనపు ఆకర్షణగా నిలుస్తుందని అంటున్నారు.
గతంలో మంచు మనోజ్ నటించిన ఊ కొడతారా ఉలిక్కి పడతారా సినిమాలో బాలయ్య గెస్ట్ రోల్ ను చేసిన విషయం తెల్సిందే. ఇప్పుడు ఆ రుణంను మనోజ్ తీర్చుకునేందుకు ఈ పాత్రను చేసేందుకు ఒప్పుకున్నాడేమో అంటూ మీడియా వర్గాల్లో టాక్ వినిపిస్తుంది. మే నెలలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమా టైటిల్ ను ఉగాది సందర్బంగా రివీల్ చేయబోతున్నట్లుగా సమాచారం అందుతోంది. అదే సమయంలో సినిమాలో మంచు మనోజ్ ఉన్నది లేనిది కూడా క్లారిటీ వస్తుందేమో చూడాలి. బాలయ్యకు జోడీగా ముద్దుగుమ్మ ప్రగ్యాజైస్వాల్ హీరోయిన్ గా నటిస్తుంది. సింహా మరియు లెజెండ్ సినిమాల తర్వాత బి.బి ల కాంబోలో వస్తున్న సినిమా అవ్వడంతో అంచనాలు భారీగా ఉన్నాయి. మరి అంచనాలను అందుకునేలా ఈ సినిమా ఉంటుందో చూడాలి.