Begin typing your search above and press return to search.

బాలయ్యకి జోడీగా స్టార్ హీరోయిన్స్ ని అందుకే తీసుకోలేదా..?

By:  Tupaki Desk   |   7 Nov 2020 12:30 AM GMT
బాలయ్యకి జోడీగా స్టార్ హీరోయిన్స్ ని అందుకే తీసుకోలేదా..?
X
నందమూరి బాలకృష్ణ - బోయపాటి శ్రీను కాంబినేషన్లో మూడో చిత్రం తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఈ యాక్షన్ ఎంటర్టైనర్ ని ద్వారక క్రియేషన్స్ బ్యానర్ పై మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మిస్తున్నాడు. 'సింహా' 'లెజెండ్' వంటి సూపర్ హిట్ సినిమాల తర్వాత వస్తున్న BB3 పై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. దీనికి తగ్గట్టే ఇప్పటికే విడుదలైన ఈ సినిమా టీజర్ మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది. ఇక ఈ చిత్రంలో ప్రయాగ మార్టిన్‌ మరియు 'అవును' ఫేమ్ పూర్ణ ని హీరోయిన్స్ గా తీసుకున్నారని వార్తలు వచ్చాయి. అయితే తాజాగా ప్రయాగ మార్టిన్‌ కి బాలయ్యజోడీ కుదరకపోవడంతో ఆమెను తప్పించి.. ప్రగ్యా జైశ్యాల్‌ ని తీసుకోనున్నట్లు టాక్ నడుస్తోంది. ఇందులో నిజమెంత అనేది తెలియనప్పటికీ.. బాలకృష్ణ సరసన స్టార్ హీరోయిన్ ని ఎందుకు తీసుకోవడం లేదనే ప్రశ్న ఫ్యాన్స్ మదిలో ఉంది. అయితే దీనికి ప్రధాన కారణం సినిమా బడ్జెట్ అని తెలుస్తోంది.

బాలయ్య కెరీర్లో 106వ చిత్రంగా రూపొందుతున్న ఈ మూవీకి సుమారు 60 కోట్ల బడ్జెట్ కేటాయించారట. అందులో ఎక్కువ భాగం హీరో మరియు డైరెక్టర్ రెమ్యూనరేషన్ కే పోతోందట. బాలకృష్ణ - బోయపాటి ఇద్దరి పారితోషికాలు కలిపి దాదాపు 25 కోట్ల వరకు ఉంటుందట. మ్యూజిక్ డైరెక్టర్ థమన్ కి కూడా డీసెంట్ రెమ్యూనరేషన్ ఇస్తున్నారట. ఈ నేపథ్యంలో బోయపాటి మిగిలిన బడ్జెట్‌ లో ఎక్కువ భాగాన్ని మేకింగ్ కోసం ఖర్చు చేయాలని ప్లాన్ చేశారని తెలుస్తోంది. ఇప్పుడు తీసుకున్న ఇద్దరు హీరోయిన్లకు కలిపి 50 లక్షల లోపే ఖర్చు అవుతుంది. అదే స్టార్ హీరోయిన్ అయితే 2 కోట్ల వరకు డిమాండ్ చేస్తుంది. ఇప్పుడు మేకర్స్ తీసుకున్న నిర్ణయం వల్ల 1.5 కోట్లు సేవ్ అయినట్లే లెక్క. దీని కారణంగానే స్టార్ హీరోయిన్ ని సంప్రదించలేదని టాక్ నడుస్తోంది.

కాగా, ఇప్పటికే ఓ షెడ్యూల్ పూర్తి చేసుకున్న ఈ చిత్రానికి సంబంధించిన తాజా షెడ్యూల్ ఇటీవలే ప్రారంభమైంది. హీరోయిన్ పూర్ణ కూడా ఈ షాట్ లో పాల్గొంటోందని సమాచారం. నవంబర్ 16 నుంచి బాలయ్య సెట్స్ లో అడుగుపెడతారని తెలుస్తోంది. ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది వేసవికి ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేలా ప్లాన్స్ చేసుకుంటున్నారు. ఇక ఈ చిత్రంలో బాలయ్య మరోసారి ద్విపాత్రాభినయం చేయనున్నారు. అందులో ఒకటి అఘోర పాత్ర.. రెండోది ఫ్యాక్షనిస్ట్ పాత్ర. ఈ చిత్రానికి 'మోనార్క్' అనే టైటిల్ ప్రచారంలో ఉంది. త్వరలోనే BB3 చిత్ర టైటిల్ ని అధికారికంగా ప్రకటించే అవకాశాలు ఉన్నాయి.