Begin typing your search above and press return to search.

బిబి : బిందు మాధవికి ఆ యంగ్ హీరో సపోర్ట్.. కారణం ఇదేనా..?

By:  Tupaki Desk   |   19 April 2022 3:30 PM GMT
బిబి : బిందు మాధవికి ఆ యంగ్ హీరో సపోర్ట్.. కారణం ఇదేనా..?
X
తెలుగు బిగ్‌ బాస్‌ నాన్ స్టాప్ లో బిందు మాధవి జోరు మామూలుగా లేదు. ఆమె గతంలో రన్నరప్ గా నిలిచిన అఖిల్‌ కు చుక్కలు చూపిస్తుంది. అతడితో ఢీ అంటే ఢీ అన్నట్లుగా గేమ్ ను ఆడుతోంది. ప్రతి విషయంలో కూడా అఖిల్ కు తీవ్రమైన పోటీ ఇస్తూ ప్రతి ఒక్కరితో ఆకట్టుకునే విధంగా తన గేమ్‌ ను కొనసాగిస్తూ ఉంది.

ఈమె ఇటీవల ఒక ఎపిసోడ్‌ లో మాట్లాడుతూ తాను లవ్ ఫెయిల్యూర్ అంటూ ప్రకటించిన విషయం తెల్సిందే. తెలుగు అమ్మాయి అయిన బిందు మాధవి తెలుగు లో కంటే తమిళంలో మంచి విజయాలను దక్కించుకుంది. కనుక తమిళంలో ఈమెకు మంచి ఫాలోయింగ్‌ ఉంది. అందుకే తమిళ బిగ్‌ బాస్ లో ఈమె గతంలో పాల్గొని ఇప్పుడు తెలుగు బిగ్‌ బాస్ కు ఛాన్స్ దక్కించుకుంది.

తెలుగు లో అరుదైన రికార్డు ను బిందు దక్కించుకుంది. తమిళం మరియు తెలుగు బిగ్‌ బాస్ ల్లో కనిపించిన ఈమె ఈసారి తెలుగు బిగ్‌ బాస్ మొదటి విజేతగా నిలిచే అవకాశం ఉందని కూడా ప్రచారం జోరుగా సాగుతోంది.

ఇక బిందు మాధవికి అభిమానులు సోషల్‌ మీడియాలో ఓ రేంజ్ లో ప్రచారం చేస్తూ ఆకట్టుకుంటున్నారు.

బిందు మాధవి కి తమిళ యంగ్‌ హీరో హరీష్‌ కళ్యాణ్‌ మద్దతుగా ట్విట్టర్ లో పోస్ట్‌ పెట్టాడు. బిందు మాధవి తప్పకుండా విజయాన్ని సొంతం చేసుకోవాలని.. ఆమెకు ఓట్లు వేయాలంటూ హరీష్ కళ్యాణ్ కోరడంతో ఇద్దరి మద్య ఏం ఉంది అంటూ ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. నటిగా ఎన్నో సినిమాల్లో నటించిన బిందు మాధవి తెలుగు బిగ్‌ బాస్ లో నెం.1 గా నిలవడం ఖాయం అంటూ ఆయన నమ్మకంగా ఉన్నాడు.

బిందు మాధవి కంటే చాలా చిన్నవాడు అయిన ఆ యంగ్‌ హీరో ఉన్నట్లుండి బిందుకు ఏమీ సపోర్ట్‌ చేయడం లేదు. ఇద్దరి మద్య చాలా కాలంగానే సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. వారిద్దరు గతంలో నే సోషల్‌ మీడియా వేదికగా తమ స్నేహంను చాటుకున్నారు. ఇప్పుడు వీరిద్దరి మద్య ఉన్నది స్నేహమా లేదంటే మరేదైనానా అంటూ జనాల్లో చర్చ జరుగుతోంది.