Begin typing your search above and press return to search.

బర్నింగ్ స్టార్‌ 'బజార్‌ రౌడి' ట్రైలర్..!

By:  Tupaki Desk   |   17 Aug 2021 8:30 AM GMT
బర్నింగ్ స్టార్‌ బజార్‌ రౌడి ట్రైలర్..!
X
'హృదయ కాలేయం' సినిమాతో హీరోగా పరిచయమైన సంపూర్ణేష్ బాబు.. బర్నింగ్ స్టార్‌ గా తనకంటూ ప్రత్యేకమైన ఫాలోయింగ్ ఏర్పరుచుకున్నారు. వరుస సినిమాలతో దూసుకుపోతున్న సంపూ.. ''బజార్‌ రౌడి'' అనే చిత్రాన్ని విడుదలకు సిద్ధం చేశారు. మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు కానుకగా, రెండు రోజుల ముందు ఆగస్ట్ 20న ఈ చిత్రాన్ని థియేట్రికల్ రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఈ నేపథ్యంలో తాజాగా సినిమా ట్రైలర్ ను చిత్ర బృందం విడుదల చేసింది.

'రౌడీలకు రామాయణం చెప్తే రావణాసురుడుని ఫాలో అవుతారు కానీ.. రాముడిని కాదు' అని సంపూర్ణేష్ బాబు చెప్పే డైలాగ్ తో ఈ ట్రైలర్ ప్రారంభమైంది. రెగ్యులర్ కమర్షియల్ సినిమాల స్టైల్ లో.. మాస్ హీరోల చిత్రాల తరహాలో యాక్షన్ సీన్స్ - భారీ డైలాగ్స్ తో ఈ ట్రైలర్ నిండిపోయి ఉంది. కాలితో తన్నితే బైక్ లేచి నిలబడటం.. ఒక రౌడీని చక్రంలా తిప్పుతూ ఫైట్ చేయడం వంటివి సంపూ మార్క్ మూవీస్ ని గుర్తు చేస్తున్నాయి.

ఇందులో సంపూర్ణేష్ బాబు రెండు పాత్రల్లో కనిపిస్తున్నారు. మ‌హేశ్వ‌రి వ‌ద్ది హీరోయిన్ గా కనిపిస్తోంది. షియాజీ షిండే - పృథ్వీ - నాగినీడు - షఫీ - జీవ‌ - స‌మీర్‌ - మణిచంద‌న‌ - న‌వీన‌ - ప‌ద్మావ‌తి తదితరులు ఇతర పాత్రల్లో కనిపిస్తున్నారు. 'బజార్‌ రౌడి' చిత్రానికి డి. వసంత నాగేశ్వరరావు ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. ట్రైలర్ చూస్తే అదే మూస ధోరణిలో ఉంది. దర్శకుడు ఈ చిత్రాన్ని రెగ్యులర్ కామెడీ అండ్ ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్‌ గా రూపొందించే ప్రయత్నం చేసారని అనిపిస్తోంది.

'బజార్‌ రౌడీ' చిత్రాన్ని బోడెంపూడి కిరణ్ కుమార్ సమర్పణలో కెఎస్ క్రియేషన్స్ పతాకంపై సంధిరెడ్డి శ్రీనివాసరావు నిర్మించారు. సాయి కార్తీక్ ఈ చిత్రానికి సంగీతం సమకూర్చారు. ఏ విజయ్ కుమార్ సినిమాటోగ్రఫీ అందించారు. సీనియర్ ఎడిటర్ గౌతమ్ రామ్ ఎడిటింగ్ బాధ్యతలు నిర్వహించారు. సంపూ కెరీర్ లో బెస్ట్ ఫిల్మ్‌ గా నిలిచిపోతుందని మేకర్స్ చెబుతున్న ఈ చిత్రం.. ఎలాంటి ఫలితాన్ని అందుకుంటుందో చూడాలి.