Begin typing your search above and press return to search.

బన్నీ కి 'బ‌తుకు బస్టాండ్' టీమ్ స్పెషల్ బర్త్ డే విషెస్..!

By:  Tupaki Desk   |   6 April 2021 1:36 PM GMT
బన్నీ కి బ‌తుకు బస్టాండ్ టీమ్ స్పెషల్ బర్త్ డే విషెస్..!
X
మెగా ప్రొడ్యూసర్ అల్లు అర‌వింద్ బావ‌మ‌రిది కొడుకు ముత్తంశెట్టి విరాన్ హీరోగా పరిచయం అవుతున్న సంగతి తెలిసిందే. 'బ‌తుకు బస్టాండ్' అనే సినిమాతో విరాన్ ప్రేక్ష‌కుల ముందుకు రాబోతున్నాడు. నిఖిత హీరోయిన్ గా నటిస్తోంది. ఈ చిత్రానికి ఐఎన్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. ఇలవల ఫిలిమ్స్ బ్యానర్ పై ఐ.కవితా రెడ్డి - కె.మాధవి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా ఫస్ట్ లుక్ కూడా విడుదలైంది. విరాన్ కు మేనత్త కొడుకైన అల్లు అర్జున్ సపోర్ట్ గా నిలుస్తున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో బన్నీకి విరాన్ స్పెషల్ గా బర్త్ డే విషెస్ తెలియజేసాడు.

అల్లు అర్జున్ ఏప్రిల్ 8న తన పుట్టినరోజును జరుపుకోనున్నారు. ఈ నేపథ్యంలో 'బ‌తుకు బస్టాండ్' టీమ్ ఓ వీడియో విడుదల చేసి స్పెషల్ గా ఆయనకు బర్త్ డే విషెస్ తెలిపింది. ఈ వీడియోలో గోడపై ఉన్న బన్నీ 'పుష్ప' పోస్టర్ కు హీరో విరాన్ సెల్యూట్ చేస్తూ కనిపిస్తున్నాడు. ఈ సందర్భంగా 'ఐకానిక్ మాస్ స్టార్ అల్లు అర్జున్' కు పుట్టినరోజు శుభాకాంక్షలు అని చిత్ర యూనిట్ పేర్కొన్నారు. ఇకపోతే యెలేందర్ మహావీర్ సంగీతం సమకూరుస్తున్న ఈ చిత్రానికి వాసు కమల్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. 'బ‌తుకు బస్టాండ్' చిత్రాన్ని జూన్ 11న విడుదల చేయడానికి మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు.