Begin typing your search above and press return to search.

ఫోటో స్టోరీ : బ్లాక్ డ్రెస్ లో బార్బీ డాల్..!

By:  Tupaki Desk   |   17 Dec 2022 9:35 AM GMT
ఫోటో స్టోరీ : బ్లాక్ డ్రెస్ లో బార్బీ డాల్..!
X
స్టార్ తనయ జాన్వి కపూర్ ఏం చేసినా సంథింగ్ స్పెషల్ అన్నట్లుగా ఉంటుంది. కేవలం సినిమాలతో ఆడియన్స్ ని అలరించడమే అన్నది కాకుండా తన గ్లామర్ ట్రీట్ తో కూడా ఫాలోవర్స్ ని ఎట్రాక్ట్ చేస్తుంది. సినిమాల్లో కన్నా జాన్వి ఫోటో షూట్స్ కే ఎక్కువ ఫ్యాన్స్ ఉన్నారని చెప్పొచ్చు. రకరకాల ఫోటో షూట్స్ తో జాన్వి ఆడియన్స్ కి పిచ్చెక్కించేస్తోంది. జాన్వి చేస్తున్న ఈ షోకి ఆమె గ్రాఫ్ మరింత పెరుగుతుంది. సోషల్ మీడియాలో చూస్తే చాలు జాన్వి ఫోటో షూట్స్ హైలెట్ అవుతున్నాయి.

తనని తాను ప్రమోట్ చేసుకోవడంలో కొత్త పంథా కొనసాగిస్తున్న జాన్వి తన ఫోటోలకు వస్తున్న రెస్పాన్స్ చూసి మరింత రెచ్చిపోతుంది. లేటెస్ట్ గా బ్లాక్ కలర్ అవుట్ ఫిట్ తో బాబోయ్ అనిపించేస్తుంది. ఒంటికి అతుక్కుపోయిన ఈ బ్లాక్ డ్రెస్ లో జాన్వి బార్బీ డాల్ లా మెరిసిపోతుంది. తెల్లతోలుకి బ్లాక్ డ్రెస్.. ఆడియన్స్ కి ఇంతకన్నా ఏం కావాలి చెప్పండి. ప్రస్తుతం జాన్వి షేర్ చేసిన ఈ ఫోటోలు ఆమె ఫ్యాన్స్ కి పిచ్చి పిచ్చిగా నచ్చేశాయ్. అందుకే ప్రస్తుతం ఈ ఫోటోలని ట్రెండ్ చేస్తున్నారు.

బాలీవుడ్ సినిమాలకు ఈక్వల్ గా ఫోటో షూట్స్ కి ప్రాధాన్యత ఇస్తున్న జాన్వి తను చేసే ఏ పనైనా పర్ఫెక్ట్ గా చేయాలని అనుకుంటుంది. ఈ క్రమంలో ఫోటో షూట్స్ విషయంలో కూడా అమ్మడు ఈ రేంజ్ లో రెచ్చిపోవడం జరుగుతుంది. హిందీలోనే కాదు టాలీవుడ్ వైపు కూడా తన ఆసక్తి కనబరచిన జాన్వి లేటెస్ట్ గా ఎన్.టి.ఆర్ 30వ సినిమాలో ఫిక్స్ అయినట్టు చెబుతున్నారు. తారక్ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇస్తుంది జాన్వి పాప.

తప్పకుండా జాన్వికి ఈ సినిమా తెలుగులో మంచి బ్రేక్ ఇస్తుందని చెప్పొచ్చు. బాలీవుడ్ లో తన టాలెంట్ తో మెప్పిస్తున్న జాన్వి తెలుగు ఆడియన్స్ ని ఏమేరకు మెప్పిస్తుందో చూడాలి. జాన్వి కపూర్ టాలీవుడ్ ఎంట్రీపై ఇక్కడ శ్రీదేవి ఫ్యాన్స్ కూడా ఎగ్జైటింగ్ గా ఉన్నారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.