Begin typing your search above and press return to search.
ప్రపంచ సుందరి కిరీటం రిగ్గింగ్ చేసి గెలిచింది! పీసీపై షాకింగ్ ఆరోపణలు!!
By: Tupaki Desk | 4 Nov 2022 12:00 PM ISTప్రియాంక చోప్రా తప్పుడు దారిలో అందాల రాణి కిరీటం గెలుచుకుందంటూ తాజాగా నాటి సహ పోటీదారు కామెంట్ చేయడం సంచలనంగా మారింది. ప్రపంచ సుందరి విజయం కోసం రిగ్గింగ్ జరిగిందని మాజీ మిస్ బార్బడోస్ లీలానీ తీవ్ర ఆరోపణలు చేసింది. భారతీయ షో స్పాన్సర్ నుండి అనుకూలత వల్లనే పీసీ పోటీలో నెగ్గిందని తన వెనక ఏదో జరుగుతోందని పార్టిసిపెంట్స్ కి తెలుసునని కూడా అంది.
మిస్ టెక్సాస్ R బోనీ గాబ్రియేల్ మిస్ USA పోటీలో గెలుపొందాక దాని చుట్టూ కొనసాగుతున్న వివాదాల నడుమ మాజీ మిస్ వరల్డ్ పోటీలో బార్బడోస్ లీలానీ మెక్ కానీ భారతీయ సుందరి ప్రియాంక చోప్రాపై ఇలాంటి సంచలన వ్యాఖ్యలు చేసింది. 2000లో పీసీ అందాల పోటీ విజయంపై లీలానీ కొన్ని షాకింగ్ ఆరోపణలు చేసింది. మాజీ మిస్ లీలానీ ఇప్పుడు యూట్యూబర్.. నాటి అందాల పోటీలో అవకతవకలు జరిగాయని.. నిర్వాహకులు స్పాన్సర్ ల నుండి అనుకూలత మాత్రమే పీసీని గెలిపించిందని.. వారి అన్యాయమైన పనుల కారణంగానే పీసీ నెగ్గిందని మిస్ టెక్సాస్ లీలానీ తనపై బురద జల్లింది.
లీలానీ తన వీడియోలో భారతీయ ప్రసార నెట్ వర్క్ స్పాన్సర్ చేసిన పోటీలో ప్రియాంక పట్ల చూపిన 'అభిమానం- పక్షపాతం' గురించి వివరించింది. ''మిస్ వరల్డ్ పోటీల్లో నేను అక్షరాలా అదే ఎదుర్కొన్నాను. పోటీలో ఈ ధోరణి ఉందని తెలిసి కూడా ముందుకు వెళ్ళాను'' అని మెక్ కానీ వార్తా స్నిప్పెట్ ల ఫోటోలు స్క్రీన్ షాట్ లను పంచుకుంటూ చెప్పారు.
"నేను మిస్ బార్బడోస్ .. నేను మిస్ వరల్డ్ పోటీకి వెళ్ళాను. నేను వెళ్ళిన సంవత్సరం మిస్ ఇండియా గెలిచింది'' అని చెబుతూ ''మిస్ ఇండియా క్రితం సంవత్సరం గెలిచింది. ఒక భారతీయ కేబుల్ స్టేషన్ వారు ప్రపంచ సుందరి పోటీకి అయ్యే మొత్తాన్ని స్పాన్సర్ చేశారు'' అని వ్యాఖ్యానించింది.
ప్రియాంక పట్ల చూపిన అభిమానాన్ని గుర్తు చేసుకుంటూ పీసీ స్విమ్ సూట్ రౌండ్ లో 'డ్రెస్ లో' ఉత్తీర్ణత సాధించిందని చెప్పింది. "పోటీలో చీరను ధరించడానికి అనుమతి పొందిన ఏకైక వ్యక్తి ప్రియాంక చోప్రా. ఆమె తన స్కిన్ టోన్ ని సరిచేయడానికి కొన్ని స్కిన్ టోన్ క్రీమ్ ను ఉపయోగించింది. అది ఇప్పటికీ స్ప్లాచ్ గా ఉంది.
ఇది బ్లీచింగ్ క్రీమ్ అని నేను చెప్పడం లేదు. అది స్కిన్-టోన్ క్రీమ్. అది పని చేయలేదు. కాబట్టి ఆమె తన చీరను తీసివేయడానికి ఇష్టపడలేదు. కాబట్టి అసలు తీర్పు సమయంలో పీసీ అక్షరాలా ఆ దుస్తులలో ఉంది" అని ఆరోపించింది. మీరు ఒక పోటీలో పోటీదారుగా ఉండి.. ఎవరైనా మీకు అనుకూలంగా ఉంటే.. దాని విషయంలో మీరు ఏం చేస్తారు? మీరు దానితో ఎందుకు ముందుకు వెళ్ళరు? అని ఆమె ప్రశ్నించింది.
పీసీ రూపం కూడా ఏమంత 'బాగా లేదు' అని కూడా ఆమె పేర్కొంది. తన గదికి భోజనం డెలివరీ చేయడం.. సోలో ప్రెస్ కాల్ లు .. ఫోటో షూట్ లు సహా ఆమెకు సాయం చేయడంలో ప్రతిదానికీ పక్షపాతం చూపించారని పీసీపై ఆరోపించింది. ఆసియా ప్రాంతం నుంచి పీసీని తప్ప వేరే ఎవరినీ పిలవలేదు. పోటీలో గెలవడానికి ముందు కూడా ప్రియాంక తో బీచ్ లో ఫోటోషూట్ లు చేశారని మెక్ కానీ పేర్కొంది. మేమంతా ఈ ఇసుక పిట్ లో కలిసి ఉన్నాము '' అని కూడా ఆమె చెప్పింది.
చోప్రా గౌనును డిజైన్ చేసిన డిజైనర్ ఇతర పోటీదారులందరికీ కూడా దుస్తులను డిజైన్ చేసారని ఆమె పేర్కొంది. అయితే ఇతరులకు చెత్త దుస్తులు ఇచ్చేవారని తెలిపారు. పీసీ గౌను మాత్రమే ఎలాంటి తప్పులు లేకుండా డిజైన్ చేసేవారని చెప్పింది. ప్రియాంక చివరికి విజేతగా నిలిచినప్పుడు జరిగిన అన్యాయాన్ని నిరసిస్తూ పోటీదారులు వేదికపై నుంచి వెళ్లిపోయారని లీలానీ వెల్లడించారు.
"మిస్ వరల్డ్ పోటీలో ప్రియాంక చోప్రా గెలుస్తుందని అందరికీ తెలుసు.. నిజానికి అది రిగ్గింగ్ తో వచ్చిన విజయం'' అని ఆమె విమర్శించింది.చాలా మంది మాజీ (అందాల) పోటీదారులు ఇలాంటి ప్రవర్తనను ఉటంకిస్తూ ఈ వీడియో ఆశ్చర్యకరంగా ఇంటర్నెట్ మద్దతును గెలుచుకుంది. మరికొందరు నెటిజన్లు కూడా "దీనికి చాలా ధన్యవాదాలు'' అంటూ కృతజ్ఞతలు తెలిపారు. ''ఈ పోటీల్లో రిగ్గింగ్ ఉంటుందని ఎప్పటినుంచో స్పష్టంగా తెలుసు. నిజమైన మనోహరమైన నిష్ణాతులైన అందాలు ఎన్నటికీ గెలవకపోవడం విచారకరం!'' అని ఒక నెటిజనుడు రాసారు. మరొకరు ''ఇది చాలా ఆసక్తికరంగా ఉంది.. మీరు అన్నింటినీ చాలా బాగా వివరిస్తారు" అని అన్నారు.
అయితే బార్బడోస్ లీలానీ వీడియో 22 ఏళ్లు ఆలస్యంగా వచ్చిందని మరికొందరు విమర్శించారు. ఒక నెటిజన్ ఆమె వీడియోతో ఏకీభవించారు. మిస్ వరల్డ్ విన్నింగ్ ప్రశ్నకు ప్రియాంక చోప్రా తప్పుడు సమాధానం ఇవ్వడం ద్వారా వివాదాన్ని ఎలా సృష్టించిందో కూడా ఎత్తి చూపారు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.