Begin typing your search above and press return to search.

అమెరికా మాజీ అధ్య‌క్షుడు బ‌రాక్ ఒబామా పాత్ర‌లో

By:  Tupaki Desk   |   1 Dec 2020 8:00 PM IST
అమెరికా మాజీ అధ్య‌క్షుడు బ‌రాక్ ఒబామా పాత్ర‌లో
X
అగ్ర‌రాజ్యం అమెరికా మాజీ అధ్య‌క్షుడు బ‌రాక్ ఒబామా బ‌యోపిక్ తెర‌కెక్కితే టైటిల్ పాత్ర‌ధారి ఎవ‌రు? అన్న‌దానికి ఒబామానే ఆన్స‌ర్ ఇవ్వ‌డం ఆస‌క్తిని క‌లిగిస్తోంది. ఫ‌లానా న‌టుడు నా బ‌యోపిక్ చేస్తే బావుంటుంది అని ఆయ‌న మ‌న‌సారా ధీవించారంటే ఆ న‌టుడి గొప్ప‌త‌నం గురించి తెలుసుకుని తీరాలి.

గ్రామీ విజేత‌గా నిలిచి ఆ న‌టుడి పేరు డ్రేక్.. అత‌డు ఒబామా పాత్ర‌లో న‌టిస్తే `గో-అహెడ్` అంటూ ఒబామా గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చేశారు. భవిష్యత్ లో మాజీ అధ్యక్షుడు ఒబామా పాత్ర పోషించడానికి సిద్ధంగా ఉన్నాన‌ని డ్రేక్ ప్ర‌క‌టించగా.. అందుకు అత‌డు అధికారిక ఆమోద ముద్రను కలిగి ఉన్నారని బరాక్ ఒబామా స్వ‌యంగా చెప్పారు.

2001 టీన్ డ్రామా `డెగ్రస్సి: ది నెక్స్ట్ జనరేషన్` లో న‌టుడిగా కెరీర్ నటనను ప్రారంభించిన గ్రామీ విజేత డ్రేక్ 2007 లో వచ్చిన కామెడీ-డ్రామా చార్లీ బార్ట్‌లెట్ లో మైమ‌రిపించే పాత్ర‌తో ఆక‌ట్టుకున్నారు. 2010 లో ఒబామా పాత్ర పోషించడానికి ఆసక్తిగా ఉన్నాన‌ని అత‌డు ప్ర‌క‌టించారు.

ఓ మ్యాగజైన్ ఇంటర్వ్యూలో ఒబామా మాట్లాడుత‌.. ``న‌టుడు డ్రేక్ తనకు కావలసినది చేయగలడని అనిపిస్తుంది. అత‌డు ప్రతిభావంతుడు. ట్యాలెంట్ ఉన్న‌ సోదరుడు. కాబట్టి బ‌యోపిక్ కి సమయం వచ్చి అతను సిద్ధంగా ఉంటే నాకు ఓకే`` అంటూ గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చేశారు. డ్రేక్ ఒబామాగా న‌టిస్తానంటే.. తామే సినిమా తీస్తామ‌ని అతని కుమార్తెల నుంచి కూడా ఆశీర్వాదం పొందడం ఆస‌క్తిక‌రం.

ప్ర‌ఖ్యాత `పేపర్ మ్యాగజైన్‌`కు 2010 లో ఇచ్చిన ఇంటర్వ్యూలో డ్రేక్ కామెంట్ అప్ప‌ట్లో వైర‌ల్ అయ్యింది. ``ఒబామా జీవితం గురించి త్వరలో ఎవరైనా సినిమా చేస్తారని ఆశిస్తున్నానని..నేను ఆ పాత్ర‌ను పోషించగలను`` అని డ్రేక్ చెప్పాడు. టీవీ చూస్తే ఒబామా ఆహార్యాన్ని బాడీ లాంగ్వేజ్ ని ప‌రిశీలిస్తాన‌ని అత‌డు చెప్పాడు. అస‌లు ఆ స‌మ‌యంలో టీవీ చానెల్ నే మార్చ‌న‌ని తెలిపాడు.

2020 మినీ సిరీస్ డ్రామా `ది కామెడీ రూల్` ..`సౌత్ సైడ్ విత్ యు` సిరీస్ ల‌లో ఒబామా పాత్ర‌ను చూపించారు. 2016 లో విడుదలైన రెండు టెలివిజన్ చిత్రాలలో ఒబామాను అమరత్వం పొందారు. అయితే పూర్తి స్థాయిలో ఒబామా రాజకీయ జీవితం పై బయోపిక్ ఇంకా రూపొందించ‌లేదు. హాలీవుడ్ లో అలాంటి ప్ర‌య‌త్నాలు ఇంకా సాగ‌నే లేదు.