Begin typing your search above and press return to search.
సుక్కూ వేడుకలో బన్ని-చరణ్ మిస్సింగ్.. కారణమిదే!
By: Tupaki Desk | 25 Feb 2021 5:00 PM ISTటాలీవుడ్ ట్యాలెంటెడ్ డైరెక్టర్ సుకుమార్ ఫ్యామిలీ ఫంక్షన్ లో స్టార్ హీరోలు ప్రత్యక్షమైన సంగతి తెలిసిందే. కుటుంబ సమేతంగా సుకుమార్ సన్నిహితులంతా హాజరయ్యారు. ముఖ్యంగా సూపర్ స్టార్ మహేష్ - నమ్రత .. ఎన్టీఆర్ - లక్ష్మీ ప్రణతి జంటలతో పాటు నాగచైతన్య- సమంత జంట హాజరయ్యారు. అల్లు కుటుంబం నుంచి ఆల్మోస్ట్ అందరూ విచ్చేయగా బన్ని మాత్రం మిస్సయ్యాడు.
అలాగే మెగాస్టార్ చిరంజీవి- రామ్ చరణ్ లకు ఆహ్వానం అందినా కానీ అటెండె కాలేకపోయారట. అయితే చిరు-చరణ్ - బన్ని వంటి ప్రముఖులు ఈ వేడుకకు స్కిప్ కొట్టడానికి కారణాలేమిటి? అన్నది ఆరా తీస్తే... చిరు-చరణ్ ప్రస్తుతం మారేడుమిల్లి (ఆంధ్రా) లో ఆచార్య మూవీ చిత్రీకరణలో ఉన్నారు. అందువల్ల అక్కడి నుంచి రాలేకపోయారట.
అలాగే అల్లు అర్జున్ పుష్ప చిత్రీకరణలో ఉన్నారు కాబట్టి.. తన లుక్ రివీల్ కాకుండా జాగ్రత్త పడ్డారని అందుకే ఈ ఈవెంట్ కి స్కిప్ కొట్టారని చెబుతున్నారు. కొందరైతే బన్ని డీసెంట్ గా సుక్కూని కలిసి వేడుక నుంచి నిష్క్రమించడం వల్లనే ఫోటోలు రివీల్ కాలేదని ఊహిస్తున్నారు.
అయితే ఇదే వేడుకలో ముగ్గురు స్టార్ హీరోల లుక్ లీకైపోయింది. సూపర్ స్టార్ మహేష్ `సర్కార్ వారి పాట` లుక్ లీక్ అవ్వగా.. ఎనర్జిటిక్ హీరో రామ్ తదుపరి మూవీ లుక్ కూడా రివీలైపోయింది. ప్రస్తుతం రామ్ లింగుస్వామి దర్శకత్వంలో మూవీ కోసం సన్నాహకాల్లో ఉన్నారు. వీళ్లతో పాటు నాగచైతన్య `థాంక్యూ` లుక్ కూడా లీకైనట్టేనని అభిమానులు భావిస్తున్నారు. చరణ్ తో రంగస్థలం.. మహేష్ తో 1-నేనొక్కడినే.. నాగచైతన్యతో 100 పర్సంట్ లవ్ చిత్రాలు తెరకెక్కించారు సుకుమార్. ప్రస్తుతం బన్నీతో పుష్ప చిత్రీకరణలో ఉన్నారు.