Begin typing your search above and press return to search.

'బంగార్రాజు' వ‌ర‌ల్డ్ వైడ్ క‌లెక్షన్స్

By:  Tupaki Desk   |   2 Feb 2022 8:30 AM GMT
బంగార్రాజు వ‌ర‌ల్డ్ వైడ్ క‌లెక్షన్స్
X
కింగ్ అక్కినేని నాగార్జున, అక్కినేని నాగ‌చైతన్య క‌లిసి న‌టించిన చిత్రం `బంగార్రాజు`. ఈ సంక్రాంతికి విడుద‌లైన ఈ చిత్రం అనూహ్య‌ విజ‌యాన్ని సాధించిన బాక్సాఫీస్ వ‌ద్ద భారీ వసూళ్ల‌ని రాబ‌ట్టింది. ర‌మ్య‌కృష్ణ‌, కృతిశెట్టి హీరోయిన్ లుగా న‌టించారు. క‌ల్యాణ్ కృష్ణ కుర‌సాల డైరెక్ట్ చేసిన ఈ మూవీని అన్న‌పూర్ణ స్టూడియోస్, జీ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మించాయి. ఔట్ అండ్ ఔట్ రొమాంటిక్ ఎంట‌ర్‌టైన‌ర్ గా రూపొందిన ఈ చిత్రం వ‌ర‌ల్డ్ వైడ్ గా భారీ వ‌సూళ్ల‌ని రాబ‌ట్టింది.

జ‌న‌వ‌రి 14న సంక్రాంతి బ‌రిలో సోలోగా దిగిన `బంగార్రాజు` విడుద‌లైన అన్ని సెంట‌ర్ ల‌లోనూ భారీ ఓపెనింగ్స్ ని రాబ‌ట్టి అనూహ్య విజ‌యాన్ని సొంతం చేసుకుంది. విడుద‌లైన అన్ని ఏరియాల్లో వ‌ర‌ల్డ్ వైడ్ గా ఈ మూవీ 76 కోట్ల గ్రాస్ ని సొంతం చేసుకుంది. నాగార్జున కెరీర్‌లో ఈ స్థాయి వ‌సూళ్ల‌ని రాబ‌ట్టిన చిత్రంగా రికార్డు సాధించింది. వ‌సూళ్ల ప‌రంగా నాగార్జున కెరీర్ బెస్ట్ మూవీగా ట్రేడ్ వ‌ర్గాలు చెబుతున్నాయి.

ఫ్యామిలీ ఎంట‌ర్ టైన‌ర్ గా రూపొందిన ఈ మూవీ 2016లో వ‌చ్చిన `సోగ్గాడే చిన్నినాయ‌`కు సీక్వెల్ గా రూపొందిన విష‌యం తెలిసిందే. ఈ చిత్రం త‌న పేరుపై కొన్న రికార్డుల్ని సొంతం చేసుకుంది. ఆంధ్రా, సీడెడ్ ఏరియాల్లో నాగ్ కెరీర్‌లోనే హ‌య్యెస్ట్ గ్రాస‌ర్ గా రికార్డు సాధించింది. సీడెడ్ లో ఈ మూవీ 12 కోట్లు వ‌సూలు చేసింది. నైజామ్ లోనూ బిజినెస్ ప‌రంగా మంచి టాక్ ని సొంతం చేసుకుంది. మూడ‌వ వారం లోనూ ఈ మూవీ కొన్ని ఏరియాల్లో సాలీడ్ షేర్ ని రాబ‌డుతోంది.

సంక్రాంతికి రిలీజ్ కావాల్సిన ఆర్ ఆర్ ఆర్‌, రాధేశ్యామ్‌, భీమ్లా నాయ‌క్ చిత్రాలు అనూహ్యంగా వాయిదా ప‌డ‌టంతో స‌డ‌న్ స‌ర్‌ప్రైజ్ అంటూ `బంగార్రాజు` సంక్రాంతి బ‌రిలో సోలోగా ఎంట్రీ ఇచ్చాడు. దీంతో ఈ సినిమాపై అక్కినేని అభిమానుల‌తో పాటు సినీ ప్రియులు భారీ స్థాయిలో ఆస‌క్తిని క‌న‌బ‌రిచారు. సంక్రాంతి బ‌రిలో `బంగార్రాజు` మిన‌హా పెద్ద చిత్ర‌మేదీ లేక‌పోవ‌డంతో ఈ చిత్రానికి బాగా క‌లిసి వ‌చ్చింది. పైగా `మ‌నం` త‌రువాత నాగార్జున‌, నాగ‌చైత‌న్య క‌లిసి న‌టించిన సినిమా కావ‌డంతో ఈ మూవీపై ప్రేక్ష‌కుల్లో ప్ర‌త్యేక ఆస‌క్తి ఏర్ప‌డింది.

ద‌ర్శ‌కుడు క‌ల్యాణ్ కృష్ణ కంప్లీట్ గా ఈ చిత్రాన్ని ఫెస్టివ‌ల్ మూవీగా మ‌ల‌చడం.. సినిమాలో నాగ‌చైత‌న్య‌, కృతిశెట్టి మ‌ధ్య వ‌చ్చే స‌న్నివేశాలు, వారి మ‌ధ్య కుదిరిన కెమిస్ట్రీ కూడా సినిమాకు బాగా హెల్ప్ అయింది. దీంతో ఈ చిత్రానికి సంక్రాంతి బ‌రిలో మంచి ఆద‌ర‌ణ ద‌క్కింది. అనూప్ రూబెన్స్ సంగీతం అందించిన ఈ చిత్ర గీతాలు కూడా ఇప్ప‌టికే సూప‌ర్ హిట్ కావ‌డంతో సినిమాకు మ‌రింత ప్ల‌స్ గా మారాయి.