Begin typing your search above and press return to search.

బంగార్రాజు విల‌న్ భూమిక‌.. అన‌సూయ స్పెష‌ల్ ట్రీట్!

By:  Tupaki Desk   |   11 March 2021 8:30 AM GMT
బంగార్రాజు విల‌న్ భూమిక‌.. అన‌సూయ స్పెష‌ల్ ట్రీట్!
X
కింగ్ లైన‌ప్ అంత‌కంత‌కు హీటెక్కించేస్తోంది. ఓవైపు వైల్డ్ డాగ్ చిత్రీక‌ర‌ణ‌ను పూర్తి చేసి రిలీజ్ కి రెడీ చేస్తున్నారు. సేమ్ టైమ్ రెండు మూడు స్క్రిప్టుల‌పై వ‌ర్క్ జ‌రుగుతోంది. అందులో `బంగార్రాజు`పై ఇప్ప‌టికే నాగ్ క్లారిటీ ఇచ్చేశారు కూడా.
తాజా స‌మాచారం మేర‌కు ఈ సినిమాను ఆగ‌స్ట్ నుంచి సెట్స్ మీద‌కు తీసుకు వెళుతున్నారని తెలుస్తోంది. క‌ళ్యాణ్ కృష్ణ ఈ చిత్రానికి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. ఇక సోగ్గాడే చిన్నినాయ‌నా చిత్రంలోని బంగార్రాజు పాత్ర‌కు కొన‌సాగింపు ఉన్నా పూర్తిగా కొత్త క‌థనే తెర‌పై నేరేట్ చేయ‌నున్నార‌ని స‌‌మాచారం.

ఇప్ప‌టికే న‌టీన‌టుల్ని ఫైన‌ల్ చేస్తున్నారు. ఈ చిత్రంలో నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్ర‌లో సీనియ‌ర్ న‌టీమ‌ణి భూమిక క‌నిపిస్తారు. అలాగే ఎప్ప‌టిలానే నాగ్ గ‌త సినిమాల త‌ర‌హాలోనే అన‌సూయ స్పెష‌ల్ ట్రీట్ ఉంటుంద‌ని తెలుస్తోంది. సంక్రాంతి రిలీజ్ ని టార్గెట్ చేసిన బంగార్రాజు ఈసారి భారీ కాంపిటీష‌న్ ని ఎదుర్కోనున్న సంగ‌తి విధిత‌మే.