Begin typing your search above and press return to search.

'బంగార్రాజు' లో రెండు స్పెషల్ నంబర్స్.. ఐటమ్ భామలు ఎవరంటే..?

By:  Tupaki Desk   |   16 Dec 2021 5:34 AM GMT
బంగార్రాజు లో రెండు స్పెషల్ నంబర్స్.. ఐటమ్ భామలు ఎవరంటే..?
X
'సోగ్గాడే చిన్ని నాయనా' సినిమాకి సీక్వెల్ గా తెరకెక్కుతున్న తాజా చిత్రం ''బంగార్రాజు''. కల్యాణ్‌ కృష్ణ కురసాల దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో కింగ్ అక్కినేని నాగార్జున - యువసామ్రాట్ నాగచైతన్య హీరోలుగా నటిస్తున్నారు. 'మనం' తర్వాత తండ్రీకొడుకులు కలిసి చేస్తున్న ఈ సినిమాపై మంచి అంచనాలున్నాయి.

'బంగార్రాజు' చిత్రాన్ని సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని శరవేగంగా షూటింగ్ జరుపుతున్నారు. అదే సమయంలో పోస్ట్ ప్రొడక్షన్ కూడా చేసేస్తున్నారు. అలానే ప్రమోషన్స్ మీద ఫోకస్ పెట్టిన మేకర్స్.. వరుస అప్డేట్స్ తో సినిమాకు బజ్ తీసుకొస్తున్నారు.

ఇప్పటికే విడుదలైన చైతన్య ఫస్ట్ లుక్ - టీజర్ - అనూప్ రూబెన్స్ స్వరపరిచిన రెండు పాటలు మంచి స్పందన తెచ్చుకున్నాయి. ఈ క్రమంలో 'పార్టీ సాంగ్ ఆఫ్ ది ఇయర్‌' పేరుతో మూడో పాటను రిలీజ్ చేయనున్నారు. ఈ స్పెషల్ సాంగ్ లో నాగ్ - చైతూ లతో కలిసి 'జాతి రత్నాలు' ఫేమ్ ఫరియా అబ్దుల్లా కలిసి డ్యాన్స్ చేయనుంది.

అయితే బంగార్రాజు చిత్రంలో ఫరియా పాటతో పాటుగా మరో ఐటమ్ సాంగ్ కూడా ఉందని సమాచారం. ఇందులో హీరోయిన్ దక్షా నగార్కర్ పెర్ఫామ్ చేస్తుందని తెలుస్తోంది. 'హోరా హోరీ' 'హుషారు' సినిమాలలో నటించిన దక్ష.. ఈ ఏడాది ప్రారంభంలో 'జాంబీ రెడ్డి' చిత్రంతో గుర్తింపు తెచ్చుకుంది. ఈ క్రమంలో ఇప్పుడు అక్కినేని హీరోల సినిమాలో ప్రత్యేక గీతంలో ఆడిపాడింది.

'బంగార్రాజు' చిత్రం నుంచి వచ్చిన 'లడ్డుండా' 'నా కోసం' పాటలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ఇదే క్రమంలో రెండు ఐటెమ్ సాంగ్స్ రాబోతున్నాయి. సాధారణంగా ఒక సినిమాలో ఒకే స్పెషల్ సాంగ్ ఉంటుంది. కానీ ఇప్పుడు ఇద్దరు బంగార్రాజులు కలిసి చేస్తున్న ఈ సినిమాలో మాత్రం రెండు ప్రత్యేక గీతాలు ఉన్నాయని తెలుస్తోంది. మరి ఈ పాటలు మాస్ జనాలను ఏ మేరకు ఆకట్టుకుంటాయో చూడాలి.

'బంగార్రాజు' చిత్రంలో నాగ్ కు జోడీగా రమ్యకృష్ణ.. నాగచైతన్య సరసన కృతి శెట్టి హీరోయిన్ గా నటిస్తున్నారు. జీ స్టూడియోస్ సమర్పణలో అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ పై నాగార్జున నిర్మిస్తున్నారు. 'సోగ్గాడే చిన్నినాయనా' తో బ్లాక్ బస్టర్ అందుకున్న నాగ్.. ఇప్పుడు తనయుడితో కలిసి ఎలాంటి విజయాన్ని అందుకుంటారో చూడాలి.