Begin typing your search above and press return to search.

నాగ్- చైత‌న్య కెరీర్ బెస్ట్ బిజినెస్ ఇదే

By:  Tupaki Desk   |   10 Jan 2022 5:34 AM GMT
నాగ్- చైత‌న్య కెరీర్ బెస్ట్ బిజినెస్ ఇదే
X
కింగ్ నాగార్జున‌- నాగ‌చైత‌న్య క‌థానాయ‌కులుగా న‌టించిన `బంగార్రాజు` సంక్రాంతి బ‌రిలో విడుద‌ల‌వుతున్న ఏకైక పెద్ద సినిమా. పోటీబ‌రిలో చిన్న సినిమాలు ఉన్నా బంగార్రాజుపైనే అంద‌రి ఫోక‌స్. ఈ సినిమా బాక్సాఫీస్ వ‌ద్ద ఎలాంటి మ్యాజిక్ చేయ‌నుందో చూడాల‌న్న ఆస‌క్తి ట్రేడ్ లో వ్య‌క్త‌మ‌వుతోంది.

తాజా స‌మాచారం మేర‌కు కింగ్ నాగార్జున‌.. నాగ‌చైత‌న్య కెరీర్ బెస్ట్ ప్రీరిలీజ్ బిజినెస్ తో బంగార్రాజు అద‌ర‌గొట్టింద‌ని తెలిసింది. వ‌రల్డ్ వైడ్ ప్రీరిలీజ్ బిజినెస్ 39 కోట్ల రేంజులో ప‌లికింద‌ని తెలిసంది. 45-50 కోట్ల మేర నెట్ వ‌సూలు చేస్తే ఈ సినిమా సేఫ్ జోన్ కి చేరుకున్న‌ట్టేన‌న్న టాక్ వినిపిస్తోంది.

పండ‌గ రేస్ నుంచి పాన్ ఇండియ‌న్ సినిమాలు ఆర్.ఆర్.ఆర్- రాధేశ్యామ్ వైదొల‌గ‌డం బంగార్రాజుకు పెద్ద ప్ల‌స్ కానుంది. ఇత‌ర మీడియం బ‌డ్జెట్ సినిమాలు విడుద‌ల‌వుతున్నా కానీ అవి కింగ్ కి పోటీ కానేకాదు. బంగార్రాజు వరల్డ్ వైడ్ ప్రీ-రిలీజ్ బిజినెస్ వివ‌రాలు ప‌రిశీలిస్తే... నైజాం 11 కోట్లు..సీడెడ్ 6 కోట్లు.. ఉత్త‌రాంధ్ర‌- 4.14 కోట్లు.. గుంటూరు 3.24 కోట్లు..తూ.గో జిల్లా 2.88 కోట్లు.. ప‌.గో జిల్లా2.60 కోట్లు.. కృష్ణ 2.70 కోట్లు.. నెల్లూరు 1.50 కోట్లు ఉంది. మొత్తం 34 కోట్ల మేర తెలుగు రాష్ట్రాల నుంచి బిజినెస్ సాగింది. ఇత‌ర భార‌త‌దేశం నుంచి 2.50 కోట్లు..విదేశాల్లో 2.54 కోట్ల మేర బిజినెస్ సాగించింది.

ఓమిక్రాన్ ప్ర‌భావం లేన‌ట్టేనా?

ఓవైపు దేశ‌వ్యాప్తంగా ఓమిక్రాన్ కేసులు పెరుగుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లోనూ అసాధార‌ణంగా కేసులు న‌మోద‌వుతున్నాయి. ఇంత‌వ‌ర‌కూ పెరుగుతున్న కోవిడ్ కేసుల కారణంగా తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటివరకు ఎటువంటి పరిమితులు విధించ‌క‌పోవ‌డం గ‌మ‌నార్హం. పండుగ కాలం ముగిసే వరకు ఆంక్ష‌లేవీ ఉండ‌వ‌ని ఆశిస్తున్నాము. ప్ర‌స్తుతానికి తెలుగు రాష్ట్రాల్లో ప‌రిస్థితి అదుపులో ఉంద‌నే భావిస్తున్నారు. పోటీలో ఎన్ని సినిమాలు ఉన్నా బంగార్రాజుపైనే సంక్రాంతి అల్లుళ్ల దృష్టి నిలుస్తుంద‌న్న అంచ‌నా ఉంది. ఏపీలో టికెట్ ధ‌ర‌లు త‌న సినిమాని ప్ర‌భావితం చేయ‌వ‌ని నాగార్జున కాన్ఫిడెన్స్ ని వ్య‌క్తం చేశారు. త‌క్కువ ధ‌ర‌లు ఉన్నా కానీ సేఫ్ జోన్ కి చేర‌తామ‌నే ధీమాను క‌న‌బ‌రిచారు. దీనిపై పంపిణీ వ‌ర్గాలు కాస్త అసంతృప్తిగా ఉన్నా కానీ నాగ్ ఏపీ ప్ర‌భుత్వ విధానాల‌పై వ్య‌తిరేక వ్యాఖ్య‌లు చేయ‌క‌పోవ‌డం గ‌మ‌నార్హం.