Begin typing your search above and press return to search.

బంగార్రాజు స్క్రిప్ట్‌ రెడీ అయ్యిందా?

By:  Tupaki Desk   |   23 Nov 2020 4:30 PM GMT
బంగార్రాజు స్క్రిప్ట్‌ రెడీ అయ్యిందా?
X
నాగార్జున నటించిన సోగ్గాడే చిన్ని నాయన సినిమా వచ్చి దాదాపుగా అయిదు ఏళ్లు అవుతుంది. అప్పటి నుండి కూడా బంగార్రాజు సినిమా గురించి మీడియాలో వార్తలు వస్తున్నాయి. సోగ్గాడే సినిమాలోని బంగార్రాజు పాత్రతో సినిమాను చేయాలని నాగార్జున భావించాడు. కళ్యాణ్‌ కృష్ణ అప్పటి నుండి బంగార్రాజు స్క్రిప్ట్‌ పై వర్క్‌ చేస్తూనే ఉన్నాడు. అదుగో ఇదుగో అంటూ వార్తలు వస్తున్నాయి కాని నాగార్జు మాత్రం వేరే సినిమాలు చేస్తూ వచ్చాడు. ఈమద్య బంగార్రాజు సౌండ్‌ లేకపోవడంతో పూర్తిగా పక్కకు పెట్టేశారేమో అనుకున్నారు.

మళ్లీ బంగార్రాజు గురించిన ప్రచారం జరుగుతోంది. వచ్చే ఏడాది ఆరంభంలోనే సినిమాకు సంబంధించిన చిత్రీకరణ ప్రారంభం అవుతుందని అంటున్నారు. నాగార్జున మాత్రమే కాకుండా ఈ సినిమాలో మరో అక్కినేని హీరో కూడా నటించబోతున్నట్లుగా వార్తలు గతంలో వచ్చాయి. యంగ్‌ అక్కినేని హీరో ఉంటాడా లేదా అనేది వచ్చే ఏడాది షూటింగ్‌ ప్రారంభం అయితే కాని తెలిసే అవకాశం లేదు. ప్రస్తుతం నాగార్జున వైల్డ్‌ డాగ్‌ సినిమా షూటింగ్‌ లో పాల్గొంటున్నాడు. ఇదే సమయంలో మరో సినిమా షూటింగ్‌ కు కూడా ఈయన సిద్దం అవ్వబోతున్నాడు. ఆ సినిమాకు ప్రవీణ్‌ సత్తారు దర్శకత్వం వహించబోతున్నాడు. ఆ తర్వాత నాగార్జున బంగార్రాజు మొదలు పెట్టే అవకాశం ఉందని అంటున్నారు.