Begin typing your search above and press return to search.
పైరసీని ప్రోత్సహిస్తున్న మల్టీప్లెక్స్?
By: Tupaki Desk | 13 May 2016 5:40 PM ISTదక్షిణాది సినీ పరిశ్రమకు కోలుకోలేని షాక్ కొట్టింది. పైరసీ భూతం ఏ స్థాయిలో పేట్రేగిపోతోందో ఇప్పటికే అర్ధమైనా.. ఇప్పుడు ఓ పేరొందిన మల్టీప్లెక్స్ సాక్షిగా జరుగుతున్న పైరసీ భాగోతం వెలుగుచూసింది. బెంగళూరు మహానగరం నడిబొడ్డున ఈ ఘటన జరిగిందని తెలియడంతో.. తెలుగు - తమిళ - కన్నడ - మలయాళ సినీ రంగాలు షాక్ తిన్నాయి.
అదో పేరొందిన కాంప్లెక్స్. అందులో బాగా పేరు పొందిన ఓ మల్టీప్లెక్స్.. అక్కడే రీసెంట్ గా విడుదలైన 24 మూవీ పైరసీ జరిగింది. రిలీజ్ రోజు నూన్ షో పడ్డ గంట వ్యవధిలోనే పైరసీ సీడీలు చెన్నై - బెంగళూరు రోడ్లు ఎక్కడంతో.. 24 మూవీ యూనిట్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. రంగంలోకి దిగిన పోలీసులు చేసిన దర్యాప్తులో అవాక్కయ్యే వాస్తవాలు బయటపడ్డాయి. మారుమూల థియేటర్లలో మాత్రమే పైరసీ జరుగుతోందనే భ్రమ నుంచి.. మూవీ మేకర్స్ ను ఈ ఘటన బయటకు తీసుకొచ్చింది.
ఇప్పుడు 24 మూవీని ఆ మల్టీప్లెక్స్ నుంచే పైరసీ చేశారనే విషయం తెలియడంతో.. దానిపై చెన్నై - బెంగళూరుల్లో ఫిర్యాదులు చేసింది యూనిట్. ప్రస్తుతం పోలీసుల దగ్గర ఉన్న సాక్ష్యాధారాల ప్రకారం.. డిజిటల్ హక్కుల ఉల్లంఘన కింద.. ఆ మల్టీప్లెక్స్ లైసెన్స్ ను రద్దు చేసే అవకాశం ఉందని అంటున్నారు. మొత్తానికి ఈ వ్యవహారంతో.. మల్టీప్లెక్సులపై ఉన్న నమ్మకం పాళ్లు దిగజారాయని చెప్పాలి.