Begin typing your search above and press return to search.

మరో బెంగళూరు బ్యూటీ

By:  Tupaki Desk   |   6 Jun 2017 12:26 PM GMT
మరో బెంగళూరు బ్యూటీ
X
విశ్వసుందరి ఐశ్వర్యా దగ్గర నుండి దీపికా పదుకొనె వరకు.. పంజాబ్ బ్యూటీ అనుష్క శర్మా కావచ్చు ఇప్పుడే విరిసిన పూజ హెగ్డే కావచ్చు.. అందరిలో ఒకటి కామన్ బ్యాక్ గ్రౌండ్ ఉంది. వీళ్ళంతా ఏదో ఒక టైమ్ లో బెంగళూరులో కొన్నాళ్లు పెరగడమో లేక అక్కడే పుట్టి పెరగడమో లేదంటే కన్నడిగులో అవ్వడం జరిగింది. బాలీవుడ్ కి బెంగళూరు భామల లక్ బాగానే కలిసివచ్చింది. ఇప్పుడు కూడా మరో చందనపు బొమ్మ నిధి అగర్వాల్ బాలీవుడ్ లోకి ఎంట్రీ అవుతుంది.

టైగర్ ష్రాఫ్‌ కొత్త సినిమా ‘మున్నా మైఖేల్’ ద్వారా ఈ హాటీ సినిమాల్లోకి ప్రవేశిస్తోంది. నార్త్ లో పుట్టి గ్రీన్ సిటీ బెంగళూరు పెరిగిన ఈ సుందరి.. 2014 మిస్ ఇండియా యూనివర్స్ కంటెస్టంట్ గా సుపరిచితం. ఆ తరువాత బికినీ బ్యూటీగా పేరు వచ్చినప్పటి నుండి ఒక్కసారిగా బాలీవుడ్ అంతా ఈ సుందరి ఎప్పుడు ఇండస్ట్రికి వస్తుందా అని ఎదురుచూశారు. మోడల్ గా తను చూపిన పరువాలు చేసిన ఫోటో షూట్లు ఇప్పటికే ఫ్యాషన్ ఇండస్ట్రి ని ఆకట్టుకున్నాయి. ఇకపోతే మున్నా మైఖేల్ పోస్టర్ లో సెక్సీ ఫిగర్ని చూపించినప్పటి నుండి ఆమె అందంపై అంచనాలు మరింత పెరిగాయి. ఆకృతి తగ్గ ఆట, తన మోడలింగ్ పోజులు అన్నీ కలిసి ట్రైలర్తో అందరినీ తాపంలో ముంచెత్తిందీ బ్యూటి. దానికి కాస్త యాక్టింగ్ తోడైతే ఇక పెద్ద హీరోయిన్ అయిపోతుందంతే.

ఇకపోతే సినిమా విడుదలే కాలేదు అప్పుడే స్టార్ హీరోయిన్ స్టైల్ లో హీరోలతో లింక్లు వచ్చేశాయి. తన రెండో సినిమా అనిల్ కపూర్ పుత్రుడు హర్ష్ వర్ధన్ తో చేస్తోందిలే. ఇప్పుడు హర్ష్ తో డేటింగ్ చేస్తుందని వార్తలు కూడా వినిపిస్తున్నాయి. మొత్తానికి చాలా మంది హిరోయిన్ల తరహాలో మిస్ ఇండియా కాంటెంస్టెంట్ గా వచ్చి.. ఈమె కూడా టాప్ రేంజ్ హీరోయిన్ అవుతుందా? చూద్దాం.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/