Begin typing your search above and press return to search.

పవన్ ను పొగుడుతూ యంగ్ హీరోలను టార్గెట్ చేస్తూ బండ్ల ట్వీట్..!

By:  Tupaki Desk   |   14 Sept 2022 2:00 PM IST
పవన్ ను పొగుడుతూ యంగ్ హీరోలను టార్గెట్ చేస్తూ బండ్ల ట్వీట్..!
X
నటుడు, నిర్మాత బండ్ల గణేష్‌ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు వీరాభిమాని అనే సంగతి తెలిసిందే. అభిమానిగా కాకుండా తనని తాను భక్తుడిగా ప్రకటించుకున్న బండ్ల.. దేవరా అంటూ ఎప్పుడూ పవన్ నామస్మరణ చేస్తుంటాడు.

బండ్ల గణేష్ తన దేవుడిపై ప్రశంసల వర్షం కురిపించే అవకాశాన్ని వెతుక్కోవడానికి ఎల్లప్పుడూ ఆసక్తిగా ఉంటాడు. సినిమా ఈవెంట్ లలో తన అభిమాన హీరోని ఉద్దేశిస్తూ పూనకం వచ్చినట్లు మాట్లాడుతూ ఉంటాడు.. ట్విట్టర్ లో ఆయన్ని స్తుతిస్తూ పోస్టులు పెడుతుంటాడు.

అందుకే మై నేమ్ ఈజ్ బండ్ల గణేష్.. మై గాడ్ ఈజ్ పవన్ కళ్యాణ్ అంటూ బండ్ల స్పీచ్.. పీకే ని ఉద్దేశిస్తూ పెట్టే ట్వీట్స్ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తుంటారు. పవన్‌ పై అభిమానం అనంతం. సూర్యుడి తేజస్సుకు చంద్రుడి చల్లదనానికి పవన్‌ పై అభిమానానికి ఎక్సపయిరీ డేట్ లేదు అంటుంటాడు బండ్ల.

ఇలా భజన చేయడం అనేది పవన్ ఫ్యాన్స్ ని ఉత్సాహ పరుస్తుంది కానీ.. అనవసరమైన పరిస్థితుల్లో కూడా పవన్ కళ్యాణ్ టాపిక్ తీసుకుని రావడమే ఇతర హీరోల అభిమానులకు టార్గెట్ అయ్యేలా చేస్తోంది.. అదే నెటిజన్లకు ట్రోలింగ్ స్టఫ్‌ గా మారుతోంది.

ఇటీవల 'శాకిని డాకిని' ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ లో అడివి శేష్ మరియు సిద్ధు జొన్నలగడ్డల ఫోటో షేర్ చేసిన బండ్ల గణేష్.. వినయం మరియు గౌరవం లేకుండా కూర్చున్నారంటూ యంగ్ హీరోలను టార్గెట్ చేశారు. కానీ ఈ సిచ్యుయేషన్ ని కూడా పవన్ ని పొగడటానికి ఉపయోగించడంపై యాంటీ ఫ్యాన్స్ సెటైర్లు వేస్తున్నారు.

"నమస్కారానికి నిలువెత్తు నిదర్శనం మా దేవర దయచేసి నేర్చుకోండి ఆచరించండి. అది మన ధర్మం" అని ట్వీట్ చేసిన బండ్ల.. దీనికి పవన్ కళ్యాణ్ చేతులు కట్టుకుని కూర్చున్న ఫోటోని జత చేయడమే కాదు.. పవర్ స్టార్ ని ట్యాగ్ చేశాడు.

అయితే యువ హీరోలు పబ్లిక్ ఈవెంట్‌లలో ఎలా ప్రవర్తించాలో పవన్ కళ్యాణ్ నుండి క్రమశిక్షణ నేర్చుకోవాలని బండ్ల ట్వీట్ పెట్టిన వెంటనే.. గతంలో పవన్ కాలు మీద కాలేసుకుని.. రిలాక్స్డ్ మూడ్‌ లో కూర్చున్న ఫోటోలను ఇతర హీరోలు అభిమానులు షేర్ చేయడం ప్రారంభించారు.

ఇద్దరు హీరోలు క్యాజువల్ గా తమకు కంఫర్ట్ గా ఉండేలా కూర్చున్నారు. అంత మాత్రాన వారికి సంస్కారం లేదని.. క్రమ శిక్షణ లేదని ఎలా జడ్జ్ చేస్తావ్ అంటూ నెటిజన్స్ బండ్ల గణేష్ ను ప్రశ్నిస్తున్నారు. పవన్ కళ్యాణ్ ఆ విధంగా కూర్చున్న ఫొటోలపై కూడా కామెంట్ చేయమని కౌంటర్ ఇస్తున్నారు.

బండ్ల గణేష్ ఇప్పుడు పవన్ తో ఇద్దరు యంగ్ హీరోలను కంపేర్ చేస్తూ పెట్టిన ట్వీట్ వల్ల.. ఇతర హీరోల అభిమానులకు పవన్ కళ్యాణ్ టార్గెట్ మారాడు. ఈ విధంగా చూస్తే బండ్ల వ్యవహారం జనసేన అధినేతతో పాటుగా ఆయన ఫ్యాన్స్ కు కూడా ఇబ్బంది కలిగిస్తోంది. బండ్ల ఈ విషయాన్ని గ్రహించి సోషల్ మీడియాలో పోస్టులు పెడితే మంచిదని సూచిస్తున్నారు.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.