Begin typing your search above and press return to search.

దేవుడిని సినిమా ఇయ్య‌మ‌ని అడ‌గ‌లేద‌ట‌

By:  Tupaki Desk   |   26 Nov 2021 11:32 AM IST
దేవుడిని సినిమా ఇయ్య‌మ‌ని అడ‌గ‌లేద‌ట‌
X
ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్ ని దేవుడిగా కొలిచేంత ప‌ర‌మ వీర‌ భ‌క్తుడు బండ్ల గ‌ణేష్. గ‌బ్బ‌ర్ సింగ్ లాంటి బ్లాక్ బ‌స్ట‌ర్ తీశాక మ‌ళ్లీ ప‌వ‌న్ తో సినిమా తీసేందుకు కాపు కాసుకుని కూచున్నాడ‌ని చాలా సార్లు క‌థ‌నాలొచ్చాయి. కానీ ప‌వ‌న్ ఆఫ‌ర్ ఇవ్వ‌లేద‌ని గుస‌గుస‌లు వినిపించాయి. అయితే ఇది నిజ‌మేనా? అని ప్ర‌శ్నిస్తే.. అస‌లు తాను ప‌వ‌న్ ని సినిమా అడ‌గ‌లేద‌ని అన్నాడు. ప‌వ‌న్ పార్టీ ఏదైనా కానీ తాను అత‌డికి భ‌క్తుడిని అని అన్నాడు. ప‌వ‌న్ ని సీఎంగా చూడాల‌నుంద‌ని కూడా బండ్ల అనడం కొస‌మెరుపు.

ప‌వ‌నేశ్వ‌ర అని అన్నారు.. అంటే దానంత‌ట అదే వ‌చ్చేసింద‌ని అన్నారు. భోళా గా మాట్లాడ‌డం దుర‌దా? అని అడిగితే .. దుర‌ద అని నాకు తెలుసు. అయితే దానికి జాలిమ్ లోష‌న్ రాయ‌డం తెలుస‌ని బండ్ల త‌న‌దైన శైలిలో అన్నారు. పెద్ద నాయ‌కుల‌తో సాయంత్రా పార్టీలు వ‌గైరా..పెద్దోళ్ల‌తో స్నేహాలేంటి? అంటే ఏ చెట్టు ప‌చ్చ‌గా ఉంటే ఆ నీడ‌కు చేర‌తాన‌ని ఇప్పుడు తాను మొక్క‌ను నాటి పెంచ‌లేన‌ని అన్నాడు.

హీరోలేమైనా దేవుళ్లా? అంటూ కాస్త ఎటాకింగ్ గానే మాట్లాడాడు బండ్ల‌. ఇక బొత్స రేంజు వాళ్ల‌కు తాను స‌మ‌కాలికుడిని అని తాను వారికి స‌మానం అని కూడా అన్నాడు బండ్ల‌. నాకంటే పెద్దోళ్లే లేర‌ని అన్నాడు. అలాగే ర‌వితేజ‌-కృష్ణ‌వంశీతో వివాదాలేమిటీ? అని ప్ర‌శ్నిస్తే.. వారు నా ద‌గ్గ‌ర పొలాలు భూములు కొన్నార‌ని బండ్ల తెలిపాడు.

హీరోల‌తో రిలేష‌న్ చెడింది క‌దా? అంటే.. హీరోల‌తో రిలేష‌న్ ఎందుకు ఉండాల‌న్నా.. హీరోలేమైనా దేవుళ్లా ఏమిటీ? అని అన్నాడు. ఇక ఏపీ రాజ‌ధాని అంశంపై ప్ర‌శ్నిస్తే.. మూడు కాదు.. నాకైతే 13 రాజ‌ధానులు చేయాల‌నుంద‌ని అన్నారు. ప్ర‌ముఖ యూట్యూబ్ చానెల్ తో మాట్లాడుతూ బండ్ల పై బోల్డ్ విష‌యాల‌పై సూటిగా మాట్లాడారు.