Begin typing your search above and press return to search.

నా జీవితంలో పెద్ద లోటు అదే: బండ్ల గణేష్

By:  Tupaki Desk   |   19 May 2020 7:00 AM IST
నా జీవితంలో పెద్ద లోటు అదే: బండ్ల గణేష్
X
మల్టి టాలెంటెడ్ పర్సన్స్ టాలీవుడ్ లో తక్కువే. అలాంటి వారిలో బండ్ల గణేష్ ఒకరు. నటుడు.. నిర్మాత.. పౌల్ట్రీ బిజినెస్ మేన్.. ఓ రాజకీయ నాయకుడు.. ఇలా చా.. లా కోణాలు ఉన్నాయి. ఇక అన్నిటిని మించి మంచి మాటకారి. ఈమధ్య బండ్ల ఒక ఇంటర్వ్యూలో ఆసక్తికరమైన విశేషాలు వెల్లడించారు. డార్లింగ్ ప్రభాస్ తో సినిమా చేసే అవకాశం మిస్ అయ్యానని చెప్పుకొచ్చారు.

కొన్నేళ్ళ క్రితం ఓ సందర్భంలో ప్రహస్ ను కలిసినప్పుడు మీతో సినిమా తీయాలని ఉందని అడిగారట. ప్రభాస్ వెంటనే సరే అన్నారట. ఇక ఒక్క క్షణం ఆలస్యం చేయకుండా లారెన్స్ ను రంగంలోకి దించితే ప్రభాస్ కు కథ వినిపించారట. అక్కడి వరకూ బాగానే జరిగింది కానీ ఆ సినిమాను బండ్ల వదులుకోవాల్సివచ్చిందట. ఈ విషయం గురించి మాట్లాడుతూ "నా జీవితంలో పెద్ద లోటు అదే. చేతికి వచ్చిన అవకాశం చేజార్చుకున్నాను. ప్రభాస్ తో ఆ రోజు సినిమా చెయ్యలేకపోయాను" అంటూ వాపోయాడు. అయితే ఆ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఫ్లాప్ గా నిలిచింది.

ప్రభాస్ తో సినిమా చెయ్యలేకపోయినా పవన్ కళ్యాణ్.. ఎన్టీఆర్.. అల్లు అర్జున్ లాంటి స్టార్లతో సినిమాలు నిర్మించాడు బండ్ల. అది గొప్ప విషయమే అనుకోవాలి. ఈమధ్య సినిమాలనిర్మాణం వైపు ఆడుగులు వస్తున్నాడు కాబట్టి భవిష్యత్తులో ఆ కల తీరుతుందేమో వేచి చూడాలి. ఏమో గుర్రం ఎగరావచ్చు!