Begin typing your search above and press return to search.
ఎన్టీఆర్ తో విభేదాలపై క్లారిటీ ఇచ్చిన బండ్ల..!
By: Tupaki Desk | 31 Aug 2021 12:55 PM ISTహాస్యనటుడుగా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన బండ్ల గణేష్.. తర్వాత రోజుల్లో భారీ బడ్జెట్ తో సినిమాలు నిర్మించే నిర్మాతగా ఎదిగారు. పరమేశ్వర ఆర్ట్స్ అనే పేరుతో ప్రొడక్షన్ హౌస్ ని ప్రారంభించి స్టార్ హీరోలతో సినిమాలు నిర్మించారు. రవితేజ - పవన్ కళ్యాణ్ - అల్లు అర్జున్ - రామ్ చరణ్ - ఎన్టీఆర్ వంటి అగ్ర హీరోలతో బండ్ల సినిమాలు తీశారు. బిజీ ప్రొడ్యూసర్ గా ఉన్న గణేష్.. 2015 లో 'టెంపర్' సినిమా తర్వాత మరో చిత్రాన్ని నిర్మించలేదు. ఆ సమయంలో ఎన్టీఆర్ తో బండ్ల గణేష్ కు ఏవో గొడవలు జరిగినట్లు అప్పట్లో కథనాలు పుట్టుకొచ్చాయి.
హీరో సచిన్ జోషి సైతం ఓ సందర్భంలో మాట్లాడుతూ.. బండ్ల గణేష్ ను ఇంటి బయటే ఉంచి తనతో మాట్లాడాలని.. అతని కోసం కాదు నీ కోసం సినిమా చేస్తానని ఎన్టీఆర్ అన్నట్లుగా చెప్పుకొచ్చాడు. దీంతో బండ్ల కు తారక్ తో విభేదాలు ఉన్నమాట నిజమే అందరూ అనుకున్నారు. అయితే ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన బండ్ల ఆ విషయంపై క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశాడు. అది కేవలం మిస్ కమ్యూనికేషన్ వల్ల మాత్రమే జరిగిందని అన్నాడు.
ఎంతో అన్యోన్యంగా ఉండే భార్యా భర్తల మధ్యలో, అలాగే అన్నాచెల్లెళ్ల మధ్య లో కూడా విభేదాలు రావడం సహజమని.. అలాగే తనకు కూడా మిస్ కమ్యూనికేషన్ వల్ల ఒక చిన్న డిస్కషన్ జరిగిందని బండ్ల గణేష్ చెప్పాడు. అంతేకాని ఇద్దరి మధ్య మరే ఇతర గొడవలు ఏమీ లేవని బండ్ల వెల్లడించారు. ఏదేమైనా అప్పట్లో బండ్ల గణేష్ మీద ఎన్టీఆర్ కోపడ్డట్లు వచ్చిన వార్తల్లో ఎంతో కొంత నిజం ఉందనేది అర్థం అవుతోంది.
ఇకపోతే 'టెంపర్' తర్వాత సినిమాలకు దూరమైన బండ్ల గణేష్.. రాజకీయాల్లో కూడా అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు ప్రయత్నం చేసి విఫలం అయ్యారు. 'సరిలేరు నీకెవ్వరు' చిత్రంతో మళ్ళీ సినిమాల్లోకి వచ్చిన బండ్ల.. ఇప్పుడు హీరోగా ఓ సినిమా చేస్తున్నాడు. ఇదే క్రమంలో ప్రొడ్యూసర్ గా కూడా బిజీ అవ్వాలని ప్లాన్ చేసుకుంటున్నారు.