Begin typing your search above and press return to search.

నా కొడుకును కూడా హీరోని చేస్తా: గబ్బర్ సింగ్ నిర్మాత

By:  Tupaki Desk   |   9 July 2020 2:20 PM IST
నా కొడుకును కూడా హీరోని చేస్తా: గబ్బర్ సింగ్ నిర్మాత
X
టాలీవుడ్ ఇండస్ట్రీలో 'గబ్బర్ సింగ్' సినిమాతో స్టార్ ప్రొడ్యూసర్ గా మారాడు కమెడియన్ కం పొలిటిషన్ బండ్ల గణేష్. చిన్న వయసులోనే సినీ ఇండస్ట్రీలోకి ప్రవేశించిన గణేష్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఎన్నో సినిమాలు చేసాడు. పవన్ కళ్యాణ్ హీరోగా తీన్మార్ సినిమా నిర్మించి నష్టపోయిన గణేష్.. గబ్బర్ సింగ్ సినిమాతో కాసుల పండగ చేసుకున్నాడు. ఆ తర్వాత అల్లు అర్జున్ హీరోగా ఇద్దరమ్మాయిలతో, ఎన్టీఆర్ హీరోగా బాద్షా, టెంపర్ సినిమాలు నిర్మించి టాప్ ప్రొడ్యూసర్ అయ్యాడు. అనంతరం మళ్లీ ఆషీకీ-2 తెలుగులో నీ జతగా నేనుండాలి పేరుతో రీమేక్ చేసి ప్లాప్ అందుకున్నాడు. ఆ సినిమా తర్వాత రాజకీయాల్లోకి వెళ్ళిపోయిన గణేష్.. గతేడాది ఎలక్షన్లలో కాంగ్రెస్ తరపున ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓటమి పాలయ్యాడు. ఇక ఇటీవలే సోషల్ మీడియాలో ప్రత్యక్షమై.. "నాకు కిక్ ఇచ్చేది రాజకీయాలు కాదు.. సినిమాలే అని తెలుసుకున్నా.

అందుకే ఇకపై సినిమాలతోనే కిక్ పొందాలని డిసైడ్ అయ్యానని" తెలిపిన గణేష్. చాలాకాలం తర్వాత మహేష్ బాబు నటించిన సరిలేరు నీకెవ్వరూ సినిమాతో మళ్లీ కెమెరా ముందుకొచ్చాడు. అయితే ఆ సినిమాలో కమెడియన్ పాత్ర చేసాడు. కాసేపు నిడివి గల ఆ పాత్రలో బండ్ల గణేష్ ఓ స్టార్ ప్రొడ్యూసర్ అయ్యుండి చేయడం ఓ విధంగా చర్చనీయాంశం అయింది. కానీ ఆ సినిమా నాకు ఎలాంటి సంతృప్తి ఇవ్వలేదని అన్నాడు. ఇంటికెళ్తే పిల్లలు కూడా అడిగారు కానీ ఇష్టమైన హీరో ఉండటం వలన తప్పలేదు అంటున్నాడు గణేష్. అయితే ఇకపై అలాంటి చిన్న పాత్రలు చేయను. మంచి ఎమోషనల్ పాత్ర చేయాలనీ ఉందన్నట్లు తన మనసులో మాట బయట పెట్టాడు ఈ నిర్మాత కం పొలిటీషియన్. ఇక ఫ్యూచర్ లో తన కొడుకును ఇండస్ట్రీకి పరిచయం చేయాలని ఉందంటున్నాడు. చూడాలి మరి గణేష్ మళ్లీ నటుడిగా సెటిల్ అవుతాడా.. లేక నిర్మాతగా సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెడతాడా..?