Begin typing your search above and press return to search.

తండ్రికి క్ష‌వ‌రం చేసిన బండ్ల గ‌ణేష్‌

By:  Tupaki Desk   |   8 May 2021 6:00 PM IST
తండ్రికి క్ష‌వ‌రం చేసిన బండ్ల గ‌ణేష్‌
X
క‌రోనా మ‌హ‌మ్మారి జ‌నాన్ని ఎంత‌గా బెంబేలెత్తిస్తోందో ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌నిలేదు. రోజుకు ల‌క్ష‌లాది కేసులు న‌మోదవుతుండ‌డంతో.. జ‌నం ఇంట్లోంచి బ‌య‌ట‌కు అడుగు వేయాలంటేనే భ‌య‌ప‌డే ప‌రిస్థితి వ‌చ్చింది. ఇక‌, కొవిడ్ బారిన ప‌డిన వారి గురించి చెప్పాల్సిన ప‌నిలేదు. వైర‌స్ పెట్టిన క‌ష్టాల‌న్నీ అనుభ‌వించి ఉంటారు కాబ‌ట్టి.. వారు మ‌రింత జాగ్ర‌త్త‌గా వ్య‌వ‌హ‌రిస్తార‌న‌డంలో సందేహ‌మే లేదు.

ఇప్పుడు.. ప్ర‌ముఖ న‌టుడు, నిర్మాత బండ్ల గ‌ణేష్ కూడా ఇదే జాగ్ర‌త్త‌లు పాటిస్తున్నారు. ఈ మ‌ధ్య‌నే గ‌ణేష్ కొవిడ్ బారిన ప‌డిన సంగ‌తి తెలిసిందే. చాలా రోజులు ట్రీట్మెంట్ తీసుకున్న ఆయ‌న‌.. వైర‌స్ ను విజ‌య‌వంతంగా ఓడించారు. ప్ర‌స్తుతం ఇంట్లో రెస్టు తీసుకుంటున్నారు.

అయితే.. తాజాగా ఆయ‌న సోష‌ల్ మీడియాలో ఓ వీడియో షేర్ చేశారు. అందులో క్ష‌రుకుడిగా మారారు గ‌ణేష్‌. త‌న తండ్రికి స్వ‌యంగా క్ష‌వ‌రం చేశారు. బ‌య‌ట ఉన్న ప‌రిస్థితుల నేప‌థ్యంలో షాపున‌కు వెళ్లే పురిస్థితి లేనందున ఇంట్లోనే స్వ‌యంగా క్ష‌వ‌రం చేశారు.

''క‌రోనా భ‌యంతో మా నాన్న‌కు ఈ రోజు షాద్ న‌గ‌ర్ లోని ఇంట్లో నేనే క‌టింగ్ చేశాను'' అని ట్వీట్ చేశారు గణేష్. ఈ వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్ గా మారింది. 'సూప‌ర్బ్‌.. వెరీ నైస్' అంటూ కామెంట్ చేస్తున్నారు నెటిజ‌న్లు.