Begin typing your search above and press return to search.
ఒప్పుకుంటే కదా తప్పుకోవడానికి : బండ్ల
By: Tupaki Desk | 7 May 2021 5:30 AM GMTబండ్ల గణేష్ నటుడిగా పలు సినిమాల్లో నటించి పవన్ సాయంతో నిర్మాతగా మారాడు. నిర్మాతగా పలు సినిమాలు నిర్మించిన బండ్ల గణేష్ కొన్ని సినిమాలు ఆర్ధికంగా నష్టపర్చడంతో గత కొంత కాలంగా నిర్మాణంకు దూరంగా ఉంటున్నాడు. నిర్మాతగా దూరంగా ఉన్నా కూడా బండ్ల గణేష్ సినిమా ఇండస్ట్రీకి దగ్గరగానే ఉంటూ వచ్చాడు.. వస్తున్నాడు. బండ్ల గణేష్ నటుడిగా సరిలేరు నీకెవ్వరు సినిమా తో రీ ఎంట్రీ ఇచ్చిన విషయం తెల్సిందే. ఆ సినిమా లో తన పాత్ర విషయంలో అసంతృప్తి వ్యక్తం చేసిన బండ్ల గణేష్ మళ్లీ నటించేందుకు ఆసక్తి చూపించలేదు. కాని ఇటీవల ఒక తమిళ మూవీ రీమేక్ లో నటించేందుకు ఓకే చెప్పాడు అంటూ వార్తలు వచ్చాయి.
తమిళంలో స్టార్ కమెడియన్ యోగి బాబు నటించిన 'మండేలా' సినిమాను బండ్ల గణేష్ రీమేక్ చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నాడని.. ఆయనే స్వయంగా రీమేక్ రైట్స్ ను దక్కించుకున్నాడు అంటూ వార్తలు వచ్చాయి. ఆ తర్వాత బండ్ల గణేష్ ఆ ప్రాజెక్ట్ ను వదిలేశాడు. దాంతో ఆ సినిమా ను ఏకే ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ లో సునీల్ హీరోగా రీమేక్ చేసేందుకు అనీల్ సుంకర ఏర్పాట్లు చేస్తున్నట్లుగా కొత్త వార్తలు వస్తున్నాయి. సోషల్ మీడియాలో బండ్ల మండేలా ప్రాజెక్ట్ నుండి తప్పుకున్నట్లుగా వస్తున్న వార్తలపై స్పందించాడు.
మండేలా సినిమా నుండి తప్పుకున్నట్లుగా వచ్చిన వార్తను రీ ట్వీట్ చేసిన బండ్ల గణేష్ 'ఒప్పుకుంటే కదా తప్పుకోవడానికి..' అంటూ ట్వీట్ చేశాడు. బండ్ల గణేష్ నిర్మాతగానే మళ్లీ సినిమాలు చేస్తాడు కాని నటుడిగా ఆయన్ను మళ్లీ స్క్రీన్ పై చూసే అవకాశం తక్కువ అంటూ ఆయన సన్నిహితులు చెబుతున్నారు. బండ్ల గణేష్ త్వరలో పవన్ కళ్యాణ్ తో ఒక సినిమాను నిర్మించే అవకాశం ఉందంటూ వార్తలు వస్తున్నాయి.