Begin typing your search above and press return to search.
బండ్ల కొత్త ట్వీట్.. పవన్ తో మూవీ ఉందా? లేదా?
By: Tupaki Desk | 12 Oct 2020 12:30 PM ISTకొన్ని రోజుల క్రితం బండ్ల గణేష్ ట్విట్టర్ లో నా దేవుడు మరోసారి నాకు ఓకే చెప్పాడు అంటూ ఆనందంతో ట్వీట్ చేశాడు. ఆ ట్వీట్ తో మరో సారి బండ్ల గణేష్ నిర్మాణంలో పవన్ కళ్యాణ్ హీరోగా సినిమా రాబోతుంది అంటూ వార్తలు వచ్చాయి. బండ్ల గణేష్ ఇప్పటికే పవన్ తో తీన్మార్ మరియు గబ్బర్ సింగ్ సినిమాలను నిర్మించాడు. మళ్లీ ఇన్నాళ్ల తర్వాత పవన్ కళ్యాణ్ తో సినిమాకు రెడీ అయ్యాడు అంటూ భారీ ఎత్తున పుకార్లు షికార్లు చేశాయి. వీరిద్దరి కాంబోకు డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాద్ దర్శకత్వం వహించే అవకాశం కూడా ఉందంటూ ప్రచారం మొదలైంది. 2021 చివర్లో లేదా 2022లో బండ్ల బ్యానర్ లో పవన్ మూవీ ప్రారంభం అవుతుందని అంతా అనుకుంటున్న సమయంలో బండ్ల గణేష్ చేసిన ట్వీట్ పలు అనుమానాలకు తెర తీస్తుంది.
బండ్ల గణేష్ ఈసారి ట్విట్టర్ లో.. వీపుమీద కొట్టండి .కానీ నీ దయ చేసి కడుపు మీద కొట్టకండి ......ఇది నా విన్నపం .నా మీద దయచేసి ఏ విధమైన వార్తలు రాయొద్దు నేను చెప్పే వరకు ఇది నా అభ్యర్థన అంటూ ట్వీట్ చేశాడు. నేను చెప్పే వరకు ఎలాంటి వార్తలు రాయవద్దు అంటూ చెప్పడం ను బట్టి చూస్తుంటే పవన్ ఓకే అనకుండానే బండ్ల గణేష్ తనకు తానుగా ఓకే అన్నాడు అనుకుని ఊహించుకుని ఆ ట్వీట్ చేశాడేమో ఇప్పుడు పవన్ నుండి సున్నితంగా హెచ్చరిక రావడంతో ఆ వార్తలను మీడియా వారు ఇష్టానుసారంగా ప్రచారం చేయవద్దంటూ బండ్ల గణేష్ విజ్ఞప్తి చేశాడు. ఈ ట్వీట్ తో బండ్ల గణేష్ కు పవన్ డేట్లు ఇచ్చే అవకాశం ఉందా? లేదా? అంటూ నెటిజన్స్ చర్చించుకుంటున్నారు. మరో ప్రకటన బండ్ల గణేష్ నుండి వచ్చే వరకు వెయిట్ చేయాల్సిందే.