Begin typing your search above and press return to search.

మెగాస్టార్ వ్యాఖ‌ల‌కు బండ్ల గ‌ణేష్ మ‌ద్ధ‌తు

By:  Tupaki Desk   |   2 Jan 2022 10:18 PM IST
మెగాస్టార్ వ్యాఖ‌ల‌కు బండ్ల గ‌ణేష్ మ‌ద్ధ‌తు
X
`టాలీవుడ్ పెద్ద దిక్కు` ఇప్పుడు హాట్ టాపిక్‌. వ‌ర్గ‌పోరుకు తెర తీస్తున్న ఈ కీల‌క అంశం మ‌రోసారి చ‌ర్చ‌కు దారి తీసిన సంగ‌తి తెలిసిందే. ద‌ర్శ‌క‌ర‌త్న డా.దాస‌రి నారాయ‌ణ‌రావు త‌ర్వాత ప‌రిశ్ర‌మలో ఆ స్థానం మెగాస్టార్ చిరంజీవికి క‌ట్ట‌బెట్టారు. దాస‌రి వ‌ర్గంతో పాటు చాలా మంది ప్ర‌ముఖులు మెగాస్టార్ కి మ‌ద్ధ‌తుగా నిలిచారు. స్వ‌త‌హాగానే సామాజిక సేవికుడిగా ఉన్న చిరంజీవికి మ‌ద్ధ‌తు ఎక్కువ‌గా క‌నిపించింది. కానీ కొంద‌రికి మాత్రం ఇది గిట్టుబాటు కాని వ్య‌వ‌హారం అన్న‌ది బ‌హిరంగ ర‌హ‌స్యం. కొంద‌రు పెద్ద‌ల్లో డివైడ్ ఫ్యాక్ట‌ర్ తెర‌పైకి తీసుకొచ్చిన‌ప్ప‌టికీ మెజార్టీ వ‌ర్గం మెగాస్టార్ కే ఆ అర్హ‌త ఉందంటూ ప‌బ్లిక్ గానే ప్ర‌క‌టించిన వైనం తెలిసిన‌దే. అయితే తాజాగా చిరంజీవి ఛారిట‌బుల్ ట్ర‌స్ట్ ఆధ్వ‌ర్యంలో యోధ లైఫ్ లైన్ డ‌యాగ్నోస్టిక్ సెంట‌ర్ తెలుగు సినీ కార్మికుల హెల్త్ కార్టుల కార్య‌క్ర‌మంలో పెద్ద‌రికంపై చిరంజీవి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసిన సంగ‌తి తెలిసిందే.

ప‌రిశ్ర‌మకు తాను పెద్దరికం వ‌హించాల‌నుకోవ‌డం లేద‌ని చిరు తెగేసి చెప్పేసారు. ఆ హోదా త‌న‌కు వ‌ద్దు అన్నారు. ఇద్ద‌రు గొడ‌వ ప‌డుతుంటే ప‌రిష్కారానికి ముందుకు రాను. కానీ ఆప‌ద‌లో ఉంటే మాత్రం క‌చ్చితంగా వ‌స్తాన‌ని చిరంజీవి వ్యాఖ్యానించారు. అయితే ఈ వ్యాఖ్య‌ల‌పై నిర్మాత బ‌డ్ల‌గ‌ణేష్ త‌న‌దైన శైలిలో స్పందించారు. `సూప‌ర్ సర్` అంటూ గ‌ణేష్ మెగాస్టార్ వ్యాఖ్య‌ల్ని స‌మ‌ర్ధించారు. అయితే `మా `ఎన్నిక‌లు త‌ర్వాత సినీ ప‌రిశ్ర‌మ‌లో నెల‌కొన్న ప‌రిస్థితుల నేప‌థ్యంలో చిరంజీవి ఇలా స్పందించ‌డం స‌ర్వ‌త్రా చ‌ర్చ‌కు దారి తీస్తోంది. పెద్ద‌రికం ర‌గ‌డ పీక్స్ లో జ‌రుగుతోన్న స‌మ‌యంలో చిరంజీవి స్పందించ‌లేదు.

అలాగే `మా ` ఎన్నిక‌ల స‌మ‌యంలోనూ చిరంజీవి మౌనం వ‌హించారు. కానీ ఓ సామాజిక కార్య‌క్ర‌మంలో చిరు ఇలాంటి వ్యాఖ్య‌లు చేయ‌డం ఆస‌క్తిగా మారింది. ఇక `మా ` అధ్య‌క్షుడిగా మంచు విష్ణు ఎన్నికైన సంగ‌తి తెలిసిందే. ఆ త‌ర్వాత మోహ‌న్ బాబు వ్యాఖ్యానం హాట్ టాపిక్ అయ్యింది. ప‌రిశ్ర‌మ‌ పెద్ద‌రికంపై ఆయ‌న అప్ప‌ట్లో క‌ర్ర విర‌గ‌కుండా..పాము చావ‌కుండా అన్న తీరుగా వ్యాఖ్యానించడం గుస‌గుస‌లకు తావిచ్చింది. ఇంత‌లో చిరంజీవి ఇలాంటి కామెంట్లు చేయ‌డం హీటెక్కించింది. అనంత‌రం మోహ‌న్ బాబు సుదీర్ఘ లేఖాస్త్రం సంచ‌ల‌నంగా మారింది. సుదీర్ఘంగా రాసిన ఈ లేఖ‌లో ప‌రిశ్ర‌మ అంటే ఆ న‌లుగురు హీరోలే కాదు! అంటూ తూర్పార‌బ‌ట్టారు. ఇది ఏ కొంద‌రిదో కానే కాద‌ని .. ఏం జ‌రిగినా అంద‌రినీ పిల‌వాల‌ని మోహ‌న్ బాబు అన్నారు. మునుముందు ఈ ఎపిసోడ్ కి కొన‌సాగింపు ఎలా ఉండ‌నుందోన‌న్న ఉత్కంఠ నెల‌కొంది ఇప్ప‌టికి.